HMD T21 Tablet Launched: HMD తన తాజా టాబ్లెట్‌ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. HMD దీని HMD T21 పేరిట తీసుకొచ్చింది. బడ్జెట్ ధరలో కొత్త టాబ్లెట్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. 2K రిజల్యూషన్, 8200mAh బిగ్ బ్యాటరీ, 8GB RAM, ఆక్టా-కోర్ Unisoc T612 ప్రాసెసర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్ల తో వస్తున్న ఈ టాబ్లెట్ ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
HMD T21 టాబ్లెట్ ధర:
HMD T21 టాబ్లెట్ 8 GB RAM+128 GB నిల్వ వేరియంట్ ధర రూ. 15,999గా నిర్ణయించారు. ఈ ట్యాబ్ బ్లాక్ స్టీల్ రంగులో వస్తుంది. ఈ పరికరం అధికారిక HMD వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
HMD T21 టాబ్లెట్ ఫీచర్లు:
HMD T21 టాబ్లెట్ 2K రిజల్యూషన్, SGS తక్కువ బ్లూ లైట్ సర్టిఫికేషన్‌ను అందించే బిగ్ 10.36-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో ఆక్టా-కోర్ యూనిసోక్ T612 ప్రాసెసర్ ను అమర్చారు. ఈ టాబ్లెట్ 8GB RAM+128GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను పొందుతుంది. టాబ్లెట్ నిల్వను మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు విస్తరించవచ్చు. ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 13 తో వస్తుంది. కానీ, ఈ టాబ్లెట్‌లో ఇప్పటికే ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్ అందుబాటులో ఉందని కంపెనీ పేర్కొంది.
ఇక కెమెరా గురించి మాట్లాడితే..HMD T21 టాబ్లెట్ వెనుక భాగంలో 8-మెగాపిక్సెల్ వెనుక, ముందు సెన్సార్‌లను కలిగి ఉంది. ఇది ఓజో ఆడియో టెక్నాలజీకి మద్దతుతో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. టాబ్లెట్ యాక్టివ్ పెన్‌కు మద్దతును కలిగి ఉంది. PC కోసం రెండవ స్క్రీన్‌గా ఉపయోగించవచ్చు.
Also read: LG Smart Tv: LG నుంచి స్మార్ట్‌టీవీలు.. AI మేజిక్ రిమోట్, అదిరిపోయే సౌండ్ కూడా!
HMD T21 టాబ్లెట్ 18W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే బిగ్ 8200mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ T21 టాబ్లెట్ అల్యూమినియం, రీసైకిల్ ప్లాస్టిక్ వంటి పర్యావరణ అనుకూల పదార్థాలతో తయారు చేయబడిందని HMD తెలిపింది.
కనెక్టివిటీ పరంగా ఈ టాబ్లెట్‌లో డ్యూయల్ సిమ్, 4G వాయిస్ కాలింగ్, SMS, Wi-Fi, GPS, బ్లూటూత్ 5.0, OTG, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. డస్ట్ , స్ప్లాష్ నిరోధకత కోసం దీనికి IP52 రేటింగ్ ఇచ్చారు. ఈ టాబ్లెట్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు మద్దతు ఇస్తుంది. పరికరం కొలతలు 157.3×247.5×7.5mm. బరువు 467 గ్రాములు.


