Saturday, November 15, 2025
Homeటెక్నాలజీHONOR X70: 8300mAh బిగ్ బ్యాటరీతో హానర్ X70 స్మార్ట్ ఫోన్..

HONOR X70: 8300mAh బిగ్ బ్యాటరీతో హానర్ X70 స్మార్ట్ ఫోన్..

HONOR X70 Launched: హానర్ తన X-సిరీస్ తాజా స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ హానర్ X70 పేరిట దీని విడుదల లాంచ్ చేసింది. అయితే, ఇండియాలో మాత్రం దీని లాంచ్ గురించి అధికారిక ధృవీకరణ లేదు. ఈ స్మార్ట్ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 చిప్‌సెట్, 12GB వరకు RAM, 50MP వెనుక కెమెరా వంటి గొప్ప ఫీచర్లు ఉన్నాయి. దీనీతో పాటు 8300mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. అయితే, ఇప్పుడు ఈ ఫోన్ కు సంబంధించి ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

- Advertisement -

Honor X70 స్మార్ట్ ఫోన్ ధర:

కంపెనీ హానర్ X70 స్మార్ట్ ఫోన్ 8GB+128GB బేస్ మోడల్ ధర హానర్ X70 CNY 1,399 (సుమారు రూ. 16,000)గా పేర్కొంది. 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 1,599 (సుమారు రూ. 19,000)గా, 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 1,799 (సుమారు రూ. 21,000)గా, 12GB+512GB RAM స్టోరేజ్ వేరియంట్ ధర CNY 1,999 (సుమారు రూ. 24,000)గా నిర్ణయించారు. ఇది బాంబూ గ్రీన్, మూన్ షాడో వైట్, మ్యాజిక్ నైట్ బ్లాక్, వెర్మిలియన్ రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది ప్రస్తుతం చైనాలో అమ్మకానికి అందుబాటులో ఉంది.

also read: HMD T21 Tablet: బ‌డ్జెట్ ధ‌ర‌లోనే HMD T21 టాబ్లెట్.. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

Honor X70 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు: 

హానర్ X70 స్మార్ట్ ఫోన్ 6.79-అంగుళాల 1.5K (1,200×2,640 పిక్సెల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ అందించారు. హ్యాండ్‌సెట్ హానర్ ఒయాసిస్ ఐ ప్రొటెక్షన్ స్క్రీన్‌ను కలిగి ఉంది. డిస్ప్లేలో అల్యూమినోసిలికేట్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్‌పై అడ్రినో 810 GPU అమర్చారు. 12GB వరకు RAM, 512GB వరకు నిల్వతో వస్తుంది. డ్యూయల్ సిమ్ (నానో) సపోర్ట్‌తో కూడిన హానర్ X70 ఆండ్రాయిడ్ 15-ఆధారిత మ్యాజిక్ OS 9.0 పై నడుస్తుంది

ఇక కేమెరా గురించి మాట్లాడితే..హానర్ X70 f/1.88 అపర్చర్, OIS సపోర్ట్‌తో AI-బ్యాక్డ్ 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం.. f/2.0 అపర్చర్‌తో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

బ్యాటరీ విషయానికి వస్తే..హానర్ X70 8,300mAh లిథియం-అయాన్ పాలిమర్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 80W వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 512GB స్టోరేజ్ వెర్షన్ 80W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ పరికరం సింగల్ ఛార్జ్ తో దాదాపు 15.6 గంటల నిరంతర నావిగేషన్ సమయాన్ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

also read: Jobs: నెలకు లక్ష రూపాయల జీతంతో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే

కనెక్టివిటీ పరంగా ఈ పరికరంలో బ్లూటూత్ 5.2, బీడౌ, GPS, AGPS, గ్లోనాస్, గెలీలియో, నావిక్, NFC, QZSS, USB టైప్-C, Wi-Fi 6, OTG వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఫోన్ డస్ట్, నీటి నిరోధకత కోసం IP66 + IP68 + IP69 సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. ఆన్‌బోర్డ్ సెన్సార్లలో యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలరేషన్ సెన్సార్, కంపాస్, గ్రావిటీ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ లైట్ సెన్సార్ ఉన్నాయి. ఇది 2D ఫేస్ రికగ్నిషన్‌కు మద్దతు ఇస్తుంది. దీని కొలతలు సుమారు 161.9×76.1×7.96mm. బరువు 193 గ్రాములు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad