Infinix Smart 10 Launched: ఇన్ఫినిక్స్ తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ దీని ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 పేరిట తీసుకొచ్చింది. ఇది ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్. ఈ విభాగంలో 4 సంవత్సరాల పాటు లాగ్-ఫ్రీ అనుభవాన్ని అందించే మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదేనని కంపెనీ పేర్కొంది. ఈ పరికరం 120Hz రిఫ్రెష్ రేట్, 5,000mAh శక్తివంతమైన బ్యాటరీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లను కూడా పొందుతుంది. వీటిని ప్రత్యేక AI బటన్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. అయితే ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
Infinix Smart 10 ధర:
ఇండియాలో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 స్మార్ట్ ఫోన్ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,799గా ఉంది. ఇది ఐరిస్ బ్లూ, స్లీక్ బ్లాక్, టైటానియం సిల్వర్, ట్విలైట్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కాగా, ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 2 నుండి ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
Also Read: Realme Buds T200: రియల్‌మీ బడ్స్ T200 విడుదల.. 50 గంటల బ్యాటరీ బ్యాకప్.. ధర కూడా తక్కువే!
Infinix Smart 10 ఫీచర్లు:
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 6.67-అంగుళాల HD+ (720×1,600 పిక్సెల్స్) IPS LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఇది ఆక్టా-కోర్ యూనిసోక్ T7250 చిప్‌సెట్‌పై నడుస్తుంది, 4GB LPDDR4x RAM, 64GB నిల్వతో జత చేశారు. మైక్రో SD కార్డ్ సహాయంతో నిల్వను 2TB వరకు విస్తరించవచ్చు. కాగా, ఫోన్ 4 సంవత్సరాల లాగ్-ఫ్రీ అనుభవం కోసం TÜV SÜD ద్వారా సర్టిఫికేషన్ పొందింది.
ఈ పరికరం ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 15.1పై నడుస్తుంది. ఇది ఫోలాక్స్ AI పర్సనల్ వాయిస్ అసిస్టెంట్‌తో సహా అనేక AI ఫీచర్లకు మద్దతు ఇస్తుంది. ఫోన్‌లో డాక్యుమెంట్ అసిస్టెంట్, రైటింగ్ అసిస్టెంట్ వంటి AI ఉత్పాదకత సాధనాలు కూడా ఉన్నాయి.
ఇక ఫోటోగ్రఫీ గురించి చెప్పాలంటే..ఇది 8-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇది డ్యూయల్ వీడియో మోడ్ రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. రెండు కెమెరాలు 30fps వద్ద 2K వీడియోను రికార్డ్ చేయగలవు.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 స్మార్ట్ ఫోన్ 5,000mAh బిగ్ బ్యాటరీతో 15W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది USB టైప్-C పోర్ట్‌ను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా.. 4G, Wi-Fi, బ్లూటూత్, GPS, FM రేడియో, OTG వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ ఇన్ఫినిక్స్ అల్ట్రాలింక్ ఫీచర్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఇది తక్కువ లేదా నెట్‌వర్క్ లేని ప్రాంతాలలో కూడా ఇతర ఇన్ఫినిక్స్ ఫోన్‌లకు కాల్ చేయడానికి అనుమతిస్తుంది. దీని కొలతలు 165.62 x 77.01 x 8.25mm. బరువు 187 గ్రాములు.


