Saturday, November 15, 2025
Homeటెక్నాలజీLava Shark 5G: త్వరలోనే లావా నుంచి మరో బడ్జెట్‌ 5జీ స్మార్ట్‌ఫోన్.. బుర్రపాడు ఫీచర్లు...

Lava Shark 5G: త్వరలోనే లావా నుంచి మరో బడ్జెట్‌ 5జీ స్మార్ట్‌ఫోన్.. బుర్రపాడు ఫీచర్లు భయ్యా..!

Lava Shark 5G New Smart Phone Launch in India: దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ లావా వరుస స్మార్ట్‌ఫోన్లను రిలీజ్‌ చేస్తూ మార్కెట్‌ను విస్తరిస్తోంది. చైనా కంపెనీలకు పోటీగా బడ్జెట్ ధరలోనే ప్రీమియం ఫీచర్లు గల స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తోంది. మే నెలలో ఇప్పటికే షార్క్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 8 వేల ధరలోపు రిలీజ్‌ చేయగా దీనికి ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. ఇప్పుడు, ఇదే వేరియంట్‌లో మరో కొత్ మొబైల్‌ను లాంచ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. లావా షార్క్ 2 అనే పేరుతో దీన్ని తీసుకురానుంది. ఇది లావా షార్క్ 5Gకి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా మార్కెట్‌లోకి విడుదల కానుంది. ఈ ఫోన్ లాంచింగ్‌కు ముందే కంపెనీ ఈ హ్యాండ్‌సెట్ రెండు కలర్ వేరియంట్‌లలో రాబోతుందని టీజ్ చేసింది. ఫోన్ డిజైన్ కూడా టీజర్‌లో చూపించింది. ఈ ఫోన్ బోల్డ్ N1 ప్రో 5Gకి సేమ్ టు సేమ్ ఫీచర్లతో రానున్నట్లు స్పష్టం చేసింది.

- Advertisement -

లావా షార్క్ 2 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు..

సోషల్ మీడియాలో కంపెనీ కొత్త ఫోన్ గురించి కొన్ని వివరాలు పంచుకుంది. ఈ ఫోన్‌ను మొత్తం రెండు కలర్‌ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. అయితే,0 కలర్ ఆప్షన్స్ పేర్లను మాత్రం వెల్లడించలేదు. లావా షార్క్ 2 మెరిసే బ్యాక్ డిజైన్‌తో ఉండవచ్చని టీజర్‌ను బట్టి తెలుస్తోంది. లావా షార్క్‌ 2 పై ఎడమ వైపు భాగాన చదరపు కెమెరా, కింద వైపు లావా బ్రాండింగ్‌తో వచ్చే అవకాశం ఉంది. ఈ లావా ఫోన్ కెమెరా విషయానికి వస్తే.. దీనిలో మొత్తం మూడు సెన్సార్లు ఇంకా ఎల్‌ఈడీ ఫ్లాష్‌ కెమెరాలను అమర్చింది. టీజర్‌ వీడియో ప్రకారం, డెకోయ్ “50MP AI కెమెరా” అని ఫోన్‌పై రాసి ఉండటాన్ని బట్టి చూస్తే.. దీనిలో 50 మెగాపిక్సెల్‌ AI ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండవచ్చని తెలుస్తోంది. టీజర్ ఇమేజ్‌లో ఫోన్ ఎడమ వైపున సిమ్ ట్రే స్లాట్‌ కనిపిస్తుంది. పవర్ ఇంకా వాల్యూమ్ బటన్‌లు కుడి వైపున ఉండే అవకాశముంది. పాత టీజర్‌లో స్పీకర్ గ్రిల్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, కింద యూఎస్‌బీ టైప్-C పోర్ట్ వంటి రానున్నాయి. అయితే, ఈ ఫోన్ బడ్జెట్ ధరలోనే రిలీజయ్యే ఛాన్స్‌ ఉంది. లావా షార్క్ 2 పాత మోడల్ ఫోన్ మాదిరిగానే దీనిలోనూ అద్భుతమైన ఫీచర్లు రానున్నాయి. అంతేకాదు, మునుపటి మోడల్‌తో పోలిస్తే దీనిలో అదనపు ఫీచర్లు ఉండనున్నాయి. కానీ పాత మోడల్ 90Hz రిఫ్రెష్ రేట్, 6.75 అంగుళాల HD+ డిస్ ప్లే ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ Unisoc T765 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. 4 GB ర్యామ్, 64 GB స్టోరేజ్‌ ఆప్షన్‌తో వస్తుంది.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad