LG OLED evo, QNED evo Launched: దక్షిణ కొరియా టెక్ కంపెనీ LG భారతదేశంలో తన ప్రీమియం స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. ఇందులో OLED evo, QNED evo మోడల్స్ ఉన్నాయి. కంపెనీ ఈసారి మెరుగైన స్క్రీన్, సౌండ్ నాణ్యతతో మాత్రమే కాకుండా.. తాజా ఆల్ఫా AI ప్రాసెసర్ Gen 2, అధునాతన AI లక్షణాలను కూడా పరిచయం చేసింది. కొత్త టీవీ శ్రేణి 43 అంగుళాల నుండి 100 అంగుళాల వరకు అనేక స్క్రీన్ పరిమాణాలలో వస్తుంది. ఇప్పుడు ఈ సిరీస్ కు సంబంధించి ధర, ఫీచర్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
LG OLED evo TV శ్రేణి, ధర
LG ప్రీమియం OLED evo సిరీస్‌లో అతిపెద్ద 97-అంగుళాల G5 అల్ట్రా లార్జ్ మోడల్ ధర రూ.24,99,990గా పేర్కొంది. దీనితో పాటు 55, 65, 77-అంగుళాల మోడల్‌లు G5 సిరీస్‌లో అందుబాటులో ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ.2,67,990గా నిర్ణయించింది.
LG C5 సిరీస్ మరిన్ని ఎంపికలతో మార్కెట్లోకి తీసుకొచ్చారు. దీనిలో 42, 48, 55, 65, 77, 83 అంగుళాల వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి. కాగా, దీని ప్రారంభ ధర రూ.1,49,990 నుండి ప్రారంభమవుతుంది. ఇదే సమయంలో, B5 సిరీస్ 55, 65 అంగుళాల సైజులలో వస్తుంది. దీని ప్రారంభ ధర మాత్రం రూ.1,93,990 వద్ద ఉంచారు.
Also read: Stock Market: స్టాక్ మార్కెట్ల జోరు.. నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్
LG QNED evo TV శ్రేణి, ధర
LG QNED evo సిరీస్‌లో LG 100-అంగుళాల టీవీ ధర రూ.11,99,990గా పేర్కొంది. దీనితో పాటు, LG 91A సిరీస్‌లోని 55, 65, 77 అంగుళాల మోడళ్ల ధర రూ.1,49,990 నుండి ప్రారంభమవుతుంది. ఇక QNED8GA / XA సిరీస్ టీవీలు 55, 65, 75 అంగుళాలలో లభిస్తాయి. వీటి ప్రారంభ ధర ₹ 1,19,990. అత్యంత సరసమైన QNED8BA సిరీస్ 43, 55, 65, 75 అంగుళాల వేరియంట్‌లలో లభిస్తుంది. ఇది కేవలం ₹ 74,990 నుండి ప్రారంభమవుతుంది. ఈ టీవీలన్నీ LG అధికారిక వెబ్‌సైట్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి.
AI ఫీచర్లు
LG కొత్త OLED evo, QNED evo సిరీస్‌లు కంపెనీ తాజా webOS ప్లాట్‌ఫామ్‌ను కలిగి ఉన్నాయి. ఇది Apple AirPlay, Google Castకి సపోర్ట్ చేస్తాయి. టీవీలో ఉన్న AI పిక్చర్ ప్రో, AI సౌండ్ ప్రో ఫీచర్లు స్క్రీన్, సౌండ్ క్వాలిటీను మరింత మెరుగుపరుస్తుంది. దీనితో పాటు, వర్చువల్ 9.1.2 ఛానల్ సరౌండ్ సౌండ్ సపోర్ట్, 165Hz హై రిఫ్రెష్ రేట్, 4K అల్ట్రా HD రిజల్యూషన్‌ను ఆస్వాదించవచ్చు. టీవీలో బ్లూ లైట్ కంట్రోల్, డైనమిక్ టోన్ మ్యాపింగ్, బ్రైట్‌నెస్ బూస్టర్ అల్టిమేట్‌తో స్మార్ట్ AI పర్సనలైజేషన్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి వినియోగదారు ఎంపిక ప్రకారం కంటెంట్‌ను సూచిస్తాయి.


