Motorola Triple Camera Setup: మోటరోలా భారతదేశ మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. అయితే, ఇప్పటికే ఈనెల మొదట్లో మోటో G96 5G మార్కెట్లో విడుదల అయినా విషయం తెలిసిందే. దీని తర్వాత కంపెనీ మరో పరికరానికి సంబంధించి తన అధికారిక X (గతంలో ట్విట్టర్) ఖాతాలో టీజర్‌ను విడుదల చేసింది. ఇది కంపెనీ కొత్త ఫోన్ గురించి సూచిస్తుంది. దీని ఫీచర్లలో ట్రిపుల్ రియర్ కెమెరా, LED ఫ్లాష్, ప్రకాశవంతమైన నియాన్ కలర్ వేరియంట్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, ఈ కొత్త ఫోన్ పవర్, వాల్యూమ్ బటన్లు కుడి వైపున ఉన్నట్లు టీజర్ లో కనిపిస్తోంది.
కంపెనీ ఈ కొత్త ఫోన్ సంబంధించి ఎలాంటి లాంచ్ తేదీ, ప్రాసెసర్ లేదా పేరు ఇంకా వెల్లడించనప్పటికీ, ఈ కొత్త ఫోన్ మోటో G86 5G లేదా మోటో G56 5G స్మార్ట్ ఫోన్ కు పోలి ఉంటుందని సమాచారం. ఈసారి మిడ్-టు-ప్రీమియం విభాగంలో మోటరోలా తన పట్టును బలోపేతం చేసుకోవాలనుకుంటుంది.
Also Read: MG M9: ఎంజీ నుంచి నయా ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ ఛార్జ్ తో 548KM రేంజ్..
డిజైన్, అధికారిక టీజర్
Xలో కనిపించే ఈ టీజర్ లో కొత్త పరికరం చాలా ఆకర్షణీయమైన నియాన్ బ్రైట్ కలర్‌లో వస్తుందని సూచిస్తుంది. ఇది యూత్ ని దృష్టిలో పెట్టుకొని తీసుకురానున్నారు. ఇక కెమెరా సెటప్‌లో సోనీ LYTIA 50MP OIS సెన్సార్, ట్రిపుల్ లెన్స్‌లు ఉండనున్నాయి.
Get ready to power through everything, effortlessly Work, play, create — no limits, just possibilities. #Motorola #ComingSoon pic.twitter.com/TAC3WsdK74
— Motorola India (@motorolaindia) July 21, 2025
మోటరోలా చేసిన ఈ టీజింగ్, ట్రిపుల్ కెమెరాలు, కర్వ్డ్ OLED డిస్ప్లే , వాటర్-డస్ట్ ప్రూఫింగ్ వంటి హై-ఎండ్ ఫీచర్లను కలిగి ఉన్న మిడ్-రేంజ్ లేదా ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ త్వరలో విడుదల కానుందని సూచిస్తుంది. అయితే కంపెనీ ఈ కొత్త ఫోన్ పేరు, ధర, నిల్వ వేరియంట్‌ల గురించి త్వరలో సమాచారం రావొచ్చు.
మోటరోలా ఇటీవల 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల ఫుల్ HD + 10 బిట్ 3D కర్వ్డ్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉన్న Moto G96 5Gని కూడా విడుదల చేసింది. ఈ ఫోన్‌లో Qualcomm Snapdragon 7S Gen 2 ప్రాసెసర్ అమర్చారు. ఇక కెమెరా సెటప్ గురించి మాట్లాడితే..మోటో G96 5G వెనుక భాగంలో OIS సపోర్ట్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఆటోఫోకస్, మాక్రో విజన్ సపోర్ట్‌తో కూడిన 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, f / 2.2 ఎపర్చరు ఉన్నాయి. ఇదే సమయంలో, సెల్ఫీ, వీడియో కాల్ కోసం f / 2.2 ఎపర్చరుతో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. మోటో G96 5Gలో 33W వైర్డ్ టర్బోపవర్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,500mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ దుమ్ము, నీటి నుండి రక్షణ కోసం IP68 రేటింగ్‌తో అమర్చబడింది. ఈ ఫోన్‌లో ఫేస్ అన్‌లాక్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అమర్చబడింది.


