Saturday, November 15, 2025
Homeటెక్నాలజీOne Plus 15 Launch Date: 7000ఎంఏహెచ్​ బ్యాటరీతో వన్ ప్లస్ 15..లాంచ్​ డేట్ ఫిక్స్..!

One Plus 15 Launch Date: 7000ఎంఏహెచ్​ బ్యాటరీతో వన్ ప్లస్ 15..లాంచ్​ డేట్ ఫిక్స్..!

One Plus 15 Launch Date Fixed: వన్ ప్లస్ లవర్స్ కు గుడ్ న్యూస్. మచ్​ అవైటెడ్​ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్​ప్లస్ 15 మార్కెట్లోకి రానుంది. ఈ పరికరం అక్టోబర్ 27న లాంచ్ కానుందని కంపెనీ తాజాగా ప్రకటించింది. ఈ స్మార్ట్​ఫోన్‌తో పాటు మరో హై-పెర్ఫార్మెన్స్ స్మార్ట్‌ఫోన్ వన్​ప్లస్ ఏస్ 6 కూడా మార్కెట్‌లోకి రానుంది. దీని స్పెసిఫికేషన్లు ఇంకా రహస్యంగానే ఉన్నప్పటికీ చైనాలోని ఆన్‌లైన్ స్టోర్‌లలో వీటిని లిస్ట్ చేశారు. కంపెనీ వన్ ప్లస్ 15 లాంచ్‌కు ముందు అనేక ఫీచర్లను టీజ్ చేసింది. అంతేకాకుండా ఈ ఫోన్ డిజైన్, చిప్‌సెట్, కలర్ ఆప్షన్‌ల గురించి సమాచారం కూడా వెల్లడైంది. ఈ పరికరం లాంచ్ కు ముందు దీని రిలీజ్ డేట్, లీకైన ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

- Advertisement -

వన్ ప్లస్ 15 రిలీజ్ డేట్:

చైనా సోషల్​ మీడియా వీబోలో చేసిన ఒక పోస్ట్‌లో.. వన్​ప్లస్ కంపెనీ వన్​ప్లస్​ 15ను అక్టోబర్ 27వ తేదీన, చైనా స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు (భారతదేశంలో సాయంత్రం 4:30 గంటలకు) విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ పరికరంతో పాటు వన్​ప్లస్ సంస్థ ఇప్పటివరకు వివరాలు వెల్లడించకుండా దాచి ఉంచిన వన్​ప్లస్​ ఏస్​ 6 కూడా లాంచ్ అవుతుందని సమాచారం.

వన్ ప్లస్ 15 ఫీచర్లు( అంచనా)

వన్ ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ 1.5K రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్‌తో థర్డ్ జనరేషన్ 1.5K BOE ఫ్లెక్సిబుల్ ఓరియంటల్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 13 శాతం HBM బ్రైట్‌నెస్ మెరుగుదల, 11.8 శాతం ఇంటెన్సిటీ కలర్ షిఫ్ట్‌కు మద్దతు ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ సెటప్ వన్ ప్లస్ 13తో పోలిస్తే డిస్‌ప్లే లైఫ్ 30 శాతం వరకు మెరుగుపరుస్తుందని, విద్యుత్ వినియోగాన్ని 10 శాతం వరకు తగ్గిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఈ పరికరం క్వాల్కమ్ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. స్నాప్‌డ్రాగన్ సమ్మిట్ 2025 సందర్భంగా కంపెనీ దీనిని ధృవీకరించింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా కలరోస్ 16పై నడుస్తుంది. అయితే, ఇండియాలో ఇది ఆక్సిజన్ OS 16తో వస్తుంది. రాబోయే ఫోన్ అల్ట్రా-హై ఫ్రేమ్ రేట్ గేమింగ్‌కు మద్దతు ఇస్తుందని వన్ ప్లస్ పేర్కొంది.

కెమెరా విషయానికి వస్తే, ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ 85mm ఫోకల్ లెంగ్త్‌తో 50-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. 3X ఆప్టికల్ జూమ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. అంటే వెనుక కెమెరా సెటప్‌లోని అన్ని కెమెరాలు 50 మెగాపిక్సెల్‌లుగా ఉంటాయి.

ఇక బ్యాటరీ గురించి మాట్లాడితే, వన్ ప్లస్ 15 7,300mAh గ్లేసియర్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 120W సూపర్ ఫ్లాష్ ఛార్జ్, 50W వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ వన్ ప్లస్ 13 కంటే బిగ్ బ్యాటరీని కలిగి ఉంది. కంపెనీ దీని ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లో 6,000mAh బ్యాటరీని అందించింది.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad