Sunday, November 16, 2025
Homeటెక్నాలజీRealme Narzo 80 Lite 4G: రూ.7299కే రియల్‌మీ నార్జో 80 లైట్ 4G.. ఫీచర్స్...

Realme Narzo 80 Lite 4G: రూ.7299కే రియల్‌మీ నార్జో 80 లైట్ 4G.. ఫీచర్స్ అదుర్స్..

Realme Narzo 80 Lite 4G Launched: రియల్‌మీ వినియోగదారుల కోసం బడ్జెట్ ధరలో కొత్త ఫోన్లను తీసుకొస్తుంది. కంపెనీ తన కొత్త బ్యాంగింగ్ ఫోన్ రియల్‌మీ నార్జో 80 లైట్ 4G ని భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో విడుదల చేసింది. కేవలం రూ.7299 ధరకు లభించే ఈ ఫోన్ లో అద్భుతమైన ఫీచర్లు ఉండటం విశేషం. ఇందులో 13MP AI కెమెరా, అల్ట్రా-స్లిమ్ ప్రీమియం డిజైన్, 6300mAh బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో వస్తోంది. ఇప్పుడు ఈ ఫోన్ కు సంబంధించి ధర, ఫీచర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

- Advertisement -

 

Realme Narzo 80 Lite 4G ధర:

రియల్‌మీ నార్జో 80 లైట్ 4G భారతదేశంలో రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. దీని 4+128Gb వేరియంట్ ధర రూ.7,299గా, 6+128Gb వేరియంట్ ధర రూ.8,299గా నిర్ణయించారు. ప్రత్యేకమైన లాంచ్ ఆఫర్ కింద, రెండు వేరియంట్లపై దాదాపు రూ. 700 కూపన్ డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతో పరికరం ప్రభావవంతమైన ధర కేవలం రూ. 6,599 కి చేరుకుంటుంది.

ఇండియాలో రియల్‌మీ నార్జో 80 లైట్ 4G సేల్స్ జూలై 28న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. దీని అమెజాన్ ఇండియా, కంపెనీ అధికారిక సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులు దీని బీచ్ గోల్డ్, అబ్సిడియన్ బ్లాక్ కలర్ ఎంపికలలో లభిస్తోంది.

Realme Narzo 80 Lite 4G ఫీచర్లు:

రియల్‌మీ నార్జో 80 లైట్ 4G పరికరం 6.74-అంగుళాల HD + డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 563 nits బ్రైట్‌నెస్, 4096 లెవల్ బ్రైట్‌నెస్ సర్దుబాటు, 90.4% స్క్రీన్-టు-బాడీ రేషియో వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ మొబైల్ UNISOC T7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 12nm ప్రాసెస్‌పై బిల్ట్ చేశారు. Mali G57 GPU తో వస్తుంది. ఈ ఫోన్ 4GB / 6GB RAM, 64GB / 128GB నిల్వ వేరియంట్‌లలో లభిస్తుంది. వీటిని 256GB వరకు విస్తరించవచ్చు.

Also Read: OnePlus Pad Lite: వన్‌ప్లస్ నుంచి కొత్త ట్యాబ్లెట్.. ధర కేవలం రూ.13 వేలే!

ఫోటోగ్రఫీ కోసం..ఇది 13MP AI వెనుక కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇది నైట్ మోడ్, పోర్ట్రెయిట్, స్లో మోషన్, డ్యూయల్-వ్యూ వీడియో వంటి అనేక మోడ్‌లను అందిస్తుంది. వెనుక కెమెరా స్లో మోషన్‌లో 1080p @ 30fps, 720p @ 120fps వరకు రికార్డ్ చేయగలదు. ఇక ఈ ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే..ఇది 15W VOOC ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే పెద్ద 6300mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది లాంగ్ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటినీ అందిస్తుంది.

ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ UI ఉంది. ఇందులో సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, గైరోస్కోప్, యాక్సిలరోమీటర్ వంటి స్మార్ట్ సెన్సార్లు ఉన్నాయి. మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, IP54 డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు దీనిని రోజువారీ ఉపయోగం కోసం ఎంతో ఉపయోగపడుతాయి. ఇది NEXT AI టెక్నాలజీ, స్మార్ట్ టచ్, 300% అల్ట్రా వాల్యూమ్ వంటి స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా..ఈ పరికరం 4G సపోర్ట్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.2, USB టైప్-C పోర్ట్‌లను కలిగి ఉంది. ప్యాకేజీలో ఫోన్‌తో పాటు 15W ఛార్జర్, USB కేబుల్, సిలికాన్ కేస్, స్క్రీన్ ప్రొటెక్షన్ ఫిల్మ్ వంటివి వస్తాయి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad