స్మార్ట్‌ఫోన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాంటి వారు ఏ ఫోన్ రిలీజ్ అయినా వెంటనే ట్రై చేస్తారు. ఈరోజే భారతదేశంలో రూ. 10,000 లోపు మంచి ఫోన్ రెడ్‌మీ తన కొత్త ఫోన్ అయిన Redmi 14Cని విడుదల చేసింది. కేవలం రూ. 9,999 ప్రారంభ ధరతో ఈ ఫోన్ Snapdragon 4 Gen 2 చిప్, 5160mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మంచి ప్రదర్శనను చూపుతోంది.
డిజైన్: Redmi 14C 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లేను అందిస్తుంది. ఈ ధర విభాగంలో ఈ రిఫ్రెష్ రేట్ చాలా అరుదైనది. డిజైన్ విషయానికి వస్తే, ఇది మూడు రంగులలో అందుబాటులో ఉంటుంది: స్టార్‌లైట్ బ్లూ, స్టార్‌డస్ట్ పర్పుల్, స్టార్‌గేజ్ బ్లాక్. కెమెరా సెటప్ ట్రిపుల్‌గా కినిపించినా అది కేవలం డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.
ప్రాసెసర్: Redmi 14C Snapdragon 4 Gen 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది, ఇందులో 6GB RAM, 128GB వరకు స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేసే ఈ ఫోన్ సాధారణ పనుల్లో స్మూత్‌గా పనిచేస్తుంది. సోషల్ మీడియా యాప్‌లు, సర్వసాధారణ పనులలో ఇది పర్ఫెక్ట్‌గా పని చేస్తోంది. గేమింగ్ సరిపోతుంది.
బ్యాటరీ, ఛార్జింగ్: ఫోన్‌లో 18W ఛార్జింగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీ ఉంది. 33W ఛార్జర్ బాక్స్‌లో ఇచ్చింది. 45 నిమిషాల్లో 34% నుంచి 92% వరకు ఛార్జ్ అవుతుంది.
Redmi 14C రూ.10,000 లోపు ధర విభాగంలో మంచి ఎంపికగా కనిపిస్తుంది. ఇది డిజైన్, ప్రాసెసర్, బ్యాటరీ, డిస్‌ప్లే వంటి ముఖ్యమైన అంశాలలో పటిష్టంగా ఉంటుంది.