Redmi Note 14 SE 5G Launched: షియోమి సబ్-బ్రాండ్ రెడ్‌మి భారత మార్కెట్లో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. కంపెనీ ఈ పరికరాన్ని బడ్జెట్ విభాగంలో ప్రవేశపెట్టింది. దీనిని రెడ్‌మి నోట్ 14 SE 5G పేరిట మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ ఇప్పటికే ఈ రెడ్‌మి నోట్ 14 లైనప్‌లో మూడు పరికరాలను తీసుకొచ్చింది. అవి రెడ్‌మి నోట్ 14 ప్రో + 5G, రెడ్‌మి నోట్ 14 ప్రో 5G, రెడ్‌మి నోట్ 14 5G. అయితే, కంపెనీ ఈ లైనప్‌లో కొత్తగా పరిచయం చేసిన రెడ్‌మి నోట్ 14 SE 5G స్మార్ట్ ఫోన్ కు సంబంధించి ధర, ఫీచర్ల వివరాల గురించి తెలుసుకుందాం.
Redmi Note 14 SE 5G ధర:
రెడ్‌మి నోట్ 14 SE 5G పరికరం 6GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. ఇది క్రిమ్సన్ ఆర్ట్ మిస్టిక్ వైట్, టైటాన్ బ్లాక్ రంగులలో లభిస్తుంది. ఈ పరికరం సేల్స్ ఆగస్టు 7 నుండి ఫ్లిప్‌కార్ట్, Xiaomi రిటైల్ స్టోర్‌లలో ప్రారంభమవుతుంది.
Also Read: Mobiles under 12K: కొత్త ఫోన్ కొనాలా? రూ.12 వేల కంటే తక్కువ బడ్జెట్ లో మోటరోలా ఫోన్లు..
Redmi Note 14 SE 5G ఫీచర్లు:
రెడ్‌మి నోట్ 14 SE 5G పరికరానికి 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 120 Hz రిఫ్రెష్ రేటును, గరిష్ట ప్రకాశం 2,100 nits వరకు అందించారు. అంతేకాకుండా ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణను పొందుతోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ 7025 ప్రాసెసర్ ను అమర్చారు. ఈ పరికరం Dolby Atmos మద్దతుతో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. ఇదే సమయంలో కొనుగోలుదారులు వైర్డు ఇయర్‌ఫోన్‌లను ఉపయోగించాలనుకుంటే, దీనిలో 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను కూడా అందుబాటులో ఉంది.
కెమెరా ఫీచర్ల గురించి చెప్పాలంటే..ఈ పరికరంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50-మెగాపిక్సెల్ సోనీ లైట్ 600 ప్రైమరీ కెమెరా అందించారు. దీనితో పాటు, ఈ పరికరం 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాను కూడా కలిగి ఉంది. ఈ పరికరం 20-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ పరికరం 5,110 mAh బిగ్ బ్యాటరీతో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.


