Friday, October 18, 2024
Homeటెక్ ప్లస్Reliance Jio : జియో న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. అదిరిపోయే ఆఫర్లు

Reliance Jio : జియో న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. అదిరిపోయే ఆఫర్లు

Reliance Jio : ఇంకొన్ని రోజుల్లో 2022 సంవ‌త్స‌రం ముగుస్తుంది. కొత్త సంవ‌త్స‌రం(2023) ప్రారంభం కానుంది. ప్ర‌తిసారి న్యూ ఇయర్‌ సంద‌ర్భంగా రిల‌య‌న్స్ జియో త‌న క‌స్ట‌మ‌ర్ల కోసం స‌రికొత్త ఆఫ‌ర్ల‌ను తీసుకువ‌స్తుంది. అయితే.. ఈ సారి ఏ ఆఫ‌ర్లు తీసుకువ‌స్తుందోన‌ని వినియోగ‌దారులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుండ‌గా వారికి శుభ‌వార్త చెప్పింది. కొత్త ఏడాది సంద‌ర్భంగా రూ.2023 ధ‌ర‌తో హ్యాపీ న్యూ ఇయ‌ర్ 2023 ప్లాన్ ను ప్రారంభించింది. దీనితో పాటు ఇప్ప‌టికే ఉన్న రూ.2999 ప్లాన్‌కు అద‌న‌పు ప్ర‌మోజ‌నాలు జోడించింది.

- Advertisement -

హ్యాపీ న్యూఇయ‌ర్ 2023 ప్లాన్‌..

ఎప్ప‌టిలాగానే సంవ‌త్స‌రాన్ని తెలియ‌జేసే విధంగా రూ.2023 ధ‌ర‌తో ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకువ‌చ్చింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 252 రోజులు. 28 రోజుల బిల్డింగ్ సైకిల్‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే 9 బిల్డింగ్ సైకిల్స్‌తో స‌మానం. ఈ ప్లాన్‌లో అప‌రిమిత కాలింగ్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అందిస్తుంది. అంతేకాకుండా రోజుకు 2.5జీబీ డేటా కూడా ల‌భిస్తుంది. వ్యాలిడిటీ వ్య‌వ‌ధికి 630 జీబీ డేటా. దీనితో పాటు జియో యాప్‌ల‌కు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. జియో కొత్త స‌బ్ స్క్రైబర్‌లకు కాంప్లిమెంటరీ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను కూడా అందిస్తుంది.

రూ.2999 ప్లాన్‌..

కొత్తగా ప్రారంభించిన ప్లాన్‌తో పాటు జియో న్యూ ఇయర్ ఆఫర్ కింద ఇప్పటికే ఉన్న రూ. 2999 ప్లాన్‌కు అదనపు ప్రయోజనాలను కూడా జోడించింది. ప్రస్తుతం ఉన్న ఆఫర్లతో పాటు రూ.2999 ప్లాన్ కు 75GB అదనపు హైస్పీడ్ డేటాతో పాటు ఏడాది వ్యాలిడిటీకి అద‌నంగా మ‌రో 23 రోజుల అద‌న‌పు వ్యాలిడిటీని అందిస్తుంది. రిల‌య‌న్స్ జియోకు చెందిన ‘మై జియో’ యాప్ ద్వారా గానీ ఇత‌ర థ‌ర్డ్ పార్టీ యాప్స్ ద్వారా గానీ రీచార్జ్ చేసుకోవ‌చ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News