Samsung Galaxy S24 5G Discount: మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా..? అది కూడా శామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్! అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ S24 5G భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. కంపెనీ లాంచ్ సమయంలో ఈ పరికరాన్ని భారతీయ మార్కెట్లో రూ.75 వేలకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఆఫర్ లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.46,999కే కొనుగోలు చేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ పరికరానికి సంబంధించి ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Samsung Galaxy S24 5G ఆఫర్:
శామ్‌సంగ్ గెలాక్సీ S24 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ సమయంలో 8GB + 128GB వేరియంట్ రూ.74,999గా, 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ.79,999గా, 8GB + 512GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ.89,999గా మార్కెట్లో విడుదల చేసారు. ప్రస్తుతం ఈ ఫోన్ 8GB + 128GB మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.46,999కి అందుబాటులో ఉంది. అంటే ఈ మోడల్ లాంచ్ ధర కంటే రూ.28,000 తక్కువకు అందుబాటులో ఉంది. ఇది నాలుగు కలర్ వేరియంట్‌లలో లభిస్తోంది. ఒనిక్స్ బ్లాక్, మార్బుల్ గ్రే, కోబాల్ట్ వైలెట్, అంబర్ యెల్లో. ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న ఆఫర్‌లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా దాని ధరను మరింత తగ్గించుకోవచ్చు.
Also Read: Nothing Phone 3: నథింగ్ ఫోన్ 3 ధర తగ్గిందోచ్.. ఏకంగా రూ.20వేలు డిస్కౌంట్!
Samsung Galaxy S24 5G ఫీచర్లు:
ఈ ఫోన్ 6.2-అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ డిస్‌ప్లే 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ పరికరం డిస్‌ప్లే విజన్ బూస్టర్ టెక్నాలజీ, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణతో వస్తుంది. ఫోన్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో వాటర్, డస్ట్ నిరోధక బిల్డ్‌తో వస్తుంది. ఈ ఫోన్ Exynos 2400 చిప్‌సెట్‌తో అమర్చబడి ఉంటుంది.
ఇక ఫోటోగ్రఫీ కోసం.. ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో OISతో 50MP ప్రధాన సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. మరోవైపు.. ఈ ఫోన్ సెల్ఫీల కోసం 12-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా AI ఆధారిత ఫీచర్‌లకు మద్దతు ఇస్తుంది. జనరేటివ్ ఎడిట్, ఇన్‌స్టంట్ స్లో-మో, సూపర్ HDR, నైటోగ్రఫీ. అంతేకాకుండా ఈ ఫోన్ 8K వీడియో రికార్డింగ్, ప్రో-గ్రేడ్ ఫోటోగ్రఫీకి మద్దతు ఇస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే..ఈ ఫోన్ 4000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ మొత్తం 7 Android OS అప్‌డేట్‌లు, 7 సంవత్సరాల భద్రతా అప్‌డేట్‌లకు అర్హత కలిగి ఉంది.


