Sunday, November 16, 2025
Homeటెక్నాలజీ5G Smartphones Under 10K: రూ.10 వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ కొనాలా..?...

5G Smartphones Under 10K: రూ.10 వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ కొనాలా..? లిస్ట్, ధర, స్పెసిఫికేషన్లు ఇవే..

Best 5G Smartphones Under 10K: కొత్త 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలా..? ఇప్పుడు మీ బడ్జెట్ తక్కువగా ఉన్నప్పటికీ 5G స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. బడ్జెట్‌ ధరలో మార్కెట్లో అనేక 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో శామ్సంగ్, పోకో, మోటరోలా, ఐక్యూ, రెడ్‌మీ వంటి బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ బడ్జెట్‌లో లభించడమే కాకుండా బిగ్ బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లు, అద్భుతమైన కెమెరాలతో వస్తున్నాయి. ఇప్పుడు కేవలం రూ.10000 కంటే తక్కవ ధరలో లభించే 5G స్మార్ట్‌ఫోన్‌ల గురుంచి తెలుసుకుందాం.

- Advertisement -

 

Samsung Galaxy M06 5G

ఈ పరికరంలో 6.7 అంగుళాల (17.02 cm) PLS LCD ఉంటుంది. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ మొబైల్ 4 GB / 6 GB RAM ఎంపికతో కొనుగోలుకు అందుబాటులో ఉంది. MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌ను అమర్చారు. స్మార్ట్‌ఫోన్‌లో 5000 mAh బ్యాటరీ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 50MP కెమెరాను కలిగి ఉంది. దీనిలో అల్ట్రా-ఫాస్ట్ కనెక్టివిటీ, స్మూత్ వీడియో కాల్స్, రెస్పాన్సివ్ గేమింగ్, ఫాస్ట్ డౌన్‌లోడ్‌లను పొందుతారు. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర ₹ 7,999.

 

iQOO Z10 Lite 5G

ఈ స్మార్ట్ ఫోన్ Funtouch OS 15 Android 15 ఆధారంగా నడుస్తుంది. దీని అమెజాన్‌లో ₹ 9,998 కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో 6.74 అంగుళాల డిస్‌ప్లే ఉంది. Dimensity 6300 5G ప్రాసెసర్‌ను అమర్చారు. ఈ ఫోన్‌లో 4GB RAM, 128GB స్టోరేజ్ అమర్చబడి ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉంది. ఈ మొబైల్ CPU వేగం 2.4GHz. 50MP సోనీ AI కెమెరా – AI ఎరేస్, AI ఫోటో ఎన్‌హాన్స్, AI డాక్యుమెంట్ మోడ్ వంటి అధునాతన AI ఫీచర్‌లతో అమర్చబడి ఉంటుంది.

Also Read: Air conditioners: అమెజాన్‌లో ఈ ఏసీలపై బంపర్ ఆఫర్లు..ఇప్పుడే కోనేయండి..

Vivo T4 Lite 5G

ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం ₹ 9999 కు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ పరికరంలో 4GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను పొందొచ్చు. ఈ ఫోన్‌లో 6.74 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లే ఉంది. దీనికి 50MP + 2MP వెనుక కెమెరా ఉంది. అయితే 5MP ముందు కెమెరా ఉంది. ఈ ఫోన్ 6000 mAh బ్యాటరీని కలిగి ఉంది. దీనికి డైమెన్సిటీ 6300 5G ప్రాసెసర్ ఉంది.

REDMI A4 5G

Redmi బ్రాండ్ ఈ ఫోన్‌ను Flipkartలో ₹ 9,416 కు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 6.88 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ను 4 GB RAM | 128 GB ROM వేరియంట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 50MP వెనుక కెమెరా, 5160 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది Android ఆక్సిజన్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. కాగా, ఆక్టాకోర్ ప్రాసెసర్‌ అమర్చారు.

 

Redmi 13C 5G

ఈ పరికరంలో 6.74 అంగుళాల డిస్ప్లే ఉంది. 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా గురించి మాట్లాడితే..వెనుక భాగంలో 50MP, 5MP ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. దీనిలో Mediatek Dimensity 6100+ ప్రాసెసర్‌ను అమర్చారు. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 9999 కు కొనుగోలు చేయవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad