Tuesday, June 17, 2025
Homeటెక్ ప్లస్Best Mileage Hybrid Cars: ఈ హైబ్రిడ్‌ కార్లు మీ ఇంట్లో ఉంటే మీ ఖర్చులు...

Best Mileage Hybrid Cars: ఈ హైబ్రిడ్‌ కార్లు మీ ఇంట్లో ఉంటే మీ ఖర్చులు తగ్గిన్నట్లే!

Best Hybrid Cars in the Market: గత కొన్నేళ్లుగా జనాలు హైబ్రిడ్‌ కార్లను కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఎలక్ట్రిక్‌ మోటార్‌ సహాయంతో సాఫ్ట్‌ డ్రైవింగ్‌, భారీ మైలేజీని ఈ కార్లు అందిస్తాయి. అందుకే ఈ కార్లను వివిధ కంపెనీలు విక్రయిస్తున్నాయి. మీ రోజువారి ఖర్చులను తగ్గించడానికి ఈ కార్లు బెస్ట్‌ అని చెప్పవచ్చు. ఏఏ కంపెనీ నుంచి ఏ కార్లు అందుబాటులో ఉన్నాయో ఈ కథనంలో చూద్దాం..

మారుతి సుజుకి గ్రాండ్‌ విటారా: ఈ ప్యూర్-పెట్రోల్ ఎస్‌యూవీ 27.97 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇది ఫుల్ ట్యాంక్‌పై (45 లీటర్లు) ఏకంగా 1,259 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దీని ధర రూ .16.99 లక్షల నుంచి రూ. 20.68 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

మారుతి సుజుకి ఇన్విక్టో: ఈ ఇన్విక్టో వెర్షన్‌ టయోటా ఇన్నోవా హైక్రాస్‌ రీబ్యాడ్జ్‌ వెర్షన్ అని చెప్పవచ్చు. ఇది లీటర్‌కి 23.24 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ కారులోని 52 లీటర్ల ట్యాంక్ 1,208 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ ఇన్విక్టో హైబ్రిడ్ ధర రూ. 25.51 లక్షల నుంచి రూ .29.22 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య లభిస్తుంది. 

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌: మారుతి, టయోటా సంయుక్తంగా ఈ కారుని తీసుకువచ్చాయి. ఇది మారుతి నెక్సా షోరూమ్స్‌తో పాటు, టయోటా టయోటా షోరూమ్‌ల నుంచి కూడా విక్రయించబడుతుంది. ఇది లీటర్‌కి 27.97 కిలోమీటర్ల ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజీని ఇస్తుంది. ఇందులోని 45 లీటర్ల ట్యాంకు 1,259 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. దీని ధర రూ.16.81 లక్షల నుంచి రూ .20.19 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

టయోటా ఇన్నోవా హైక్రాస్: ఈ ఇన్నోవా హైబ్రిడ్ వెర్షన్ లీటరుకు 23.24 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ కారులో 52 లీటర్ల ఫుల్‌ ట్యాంకు కెపాసిటీ కలదు. ఇది 1,208 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ హైబ్రిడ్ వెర్షన్ ధర రూ .26.31 లక్షల నుంచి రూ .31.34 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

హోండా సిటీ ఇ:హెచ్ఇవి: హోండా నుంచి అందుబాటులో ఉన్న ఈ హైబ్రిడ్‌ సెడాన్ లీటరుకు 27.26 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇందులోని 40 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంకు 1,090 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కేవలం ఒకే వెర్షన్‌లో లభిస్తున్న ఈ సిటీ ఇ:హెచ్ ఈవీ ధర రూ.20.85 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News