Vivo Y04s Launched: చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. కంపెనీ దీని వివో Y04s పేరిట ఇండోనేషియాలో విడుదల చేసింది. తక్కువ బడ్జెట్ లో వస్తున్న ఈ మొబైల్ లో అనేక అబ్దుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ పరికరంలో ఈ ఫోన్ LCD టచ్‌స్క్రీన్, Unisoc ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. రెండు కలర్ ఆప్షన్లలో ఒకే ఒక స్టోరేజ్ వేరియంట్‌లో వచ్చిన ఈ ఫోన్ ధర, ఫీచర్ల వివరాల గురించి తెలుసుకుందాం.
Vivo Y04s ధర:
వివో Y04s స్మార్ట్ ఫోన్ ధర ఇండోనేషియాలో IDR 13,99,000 (సుమారు రూ. 7,480)గా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఒకే స్టోరేజ్ వేరియంట్‌లో రెండు కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. క్రిస్టల్ పర్పుల్, జాడే గ్రీన్. ఇండోనేషియాలో ఈ పరికరాన్ని వివో అధికారిక స్టోర్, అకులకు, షాపీ, బ్లిబ్లి, టిక్‌టాక్ స్టోర్ నుండి కొనుగోలు చేయవచ్చు.
Vivo Y04s ఫీచర్లు:
Vivo Y04s డిస్ప్లే:
ఈ పరికరం 6.74-అంగుళాల HD+ LCD డిస్ప్లే (1600×720 పిక్సెల్ రిజల్యూషన్) కలిగిన డ్యూయల్-సిమ్ స్మార్ట్‌ఫోన్. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60Hz నుండి 90Hz మధ్య సర్దుబాటు అవుతుంది. ఇది 570 nits పీక్ బ్రైట్‌నెస్, 260ppi పిక్సెల్ డెన్సిటీని పొందుతుంది. ఫోన్ Unisoc T612 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో అమర్చబడి 4GB LPDDR4X RAMతో జత చేయబడింది.
Vivo Y04s స్టోరేజ్:
స్టోరేజ్ గురించి చెప్పాలంటే..ఇది 64GB eMMC5.1 ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. దీనిని మైక్రో SD కార్డ్‌తో 1TB వరకు విస్తరించవచ్చు. ఫోన్ వెనుక ప్యానెల్ క్రిస్టల్ మ్యాట్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది దీనికి ప్రీమియం లుక్ ఇస్తుంది.
Also Read:Discount: గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ పై ఏకంగా రూ.30 వేల డిస్కౌంట్.. ఇప్పుడే త్వరపడండి!
Vivo Y04s కెమెరా:
కెమెరా సెటప్‌లో 13MP ప్రైమరీ కెమెరా, వెనుక భాగంలో QVGA సెకండరీ లెన్స్‌తో పాటు LED ఫ్లాష్ ఉన్నాయి. ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది వాటర్‌డ్రాప్-నాచ్‌లో అమర్చబడి ఉంటుంది. కెమెరా ఫీచర్లలో నైట్, పోర్ట్రెయిట్, పనోరమా, స్లో మోషన్, టైమ్ లాప్స్ మోడ్‌లు ఉన్నాయి.
Vivo Y04s కనెక్టివిటీ ఫీచర్లు:
ఫోన్‌లో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి సెన్సార్లు ఉన్నాయి. ఇక కనెక్టివిటీ పరంగా..ఇది 4G, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.2, USB టైప్-C, GPS, బీడౌ, గ్లోనాస్, గెలీలియోలకు మద్దతు ఇస్తుంది.
Vivo Y04s బ్యాటరీ:
ఈ స్మార్ట్ ఫోన్ 6000mAh బ్యాటరీతో 15W ఫ్లాష్‌ఛార్జ్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఇది FuntouchOS 14 (Android 14)పై నడుస్తుంది. ఫోన్ పరిమాణం 167.30 × 76.95 × 8.19mm. బరువు 202 గ్రాములు.


