Monday, June 16, 2025
Homeటెక్ ప్లస్Vivo Y400 Pro: 32MP సెల్ఫీ కెమెరాతో వస్తున్న వివో వై400 ప్రో స్మార్ట్‌ఫోన్

Vivo Y400 Pro: 32MP సెల్ఫీ కెమెరాతో వస్తున్న వివో వై400 ప్రో స్మార్ట్‌ఫోన్

Vivo Y400 Pro Mobile Features: చైనా మొబైళ్ల తయారీ కంపెనీ వివో భారత మార్కెట్లో తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. ఇటీవల T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన తర్వాత కంపెనీ ఇప్పుడు వివో Y400 ప్రోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రాబోయే స్మార్ట్‌ఫోన్ వివో వై400 Pro 32ఎంపి సెల్ఫీ కెమెరాతో వస్తోంది. దీనితో పాటు ఈ ఫోన్ 90డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5500 ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. దీని ధర రూ. 23,990 ఉండే అవకాశముంది.

- Advertisement -


వివో ప్లాట్‌ఫామ్ Xలో రాబోయే స్మార్ట్‌ఫోన్ మొదటి టీజర్‌ను విడుదల చేసింది. దీనిలో తెలుపు రంగు ఎంపికలో ఉన్న ఫోన్ వీడియోలో చూపబడింది. ఈ నెలాఖరు నాటికి స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు ఇటీవల లీక్ అయ్యాయి.టీజర్ ఫోన్ వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను చూపిస్తుంది. దీనికి 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రధాన సెన్సార్ ఉండవచ్చు, దానితో 2-మెగాపిక్సెల్ బోకె లెన్స్ ఉంటుందని భావిస్తున్నారు.

ఫోన్‌లో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు. దీనిలో AI ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్, AI సూపర్‌లింక్, AI నోట్ అసిస్ట్, AI స్క్రీన్ ట్రాన్స్‌లేషన్, Vivo లైవ్ కాల్ ట్రాన్స్‌లేషన్, AI లైవ్ టెక్స్ట్, సర్కిల్ టు సెర్చ్ వంటి ఫీచర్లు ఉంటాయి. 6.77-అంగుళాల అమోల్డ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ఉంది. ఈ ఫోన్‌ను 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజ్, 256జిబి స్టోరేజ్ ఆప్షన్‌లతో లాంచ్ చేయవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News