Vu Glo QLED TV 2025 Dolby Edition Launched: భారతీయ స్మార్ట్ టీవీ మార్కెట్లో సరసమైన, హై-క్లాస్ టీవీ కొనుగోలు చేయాలనీ చూస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. Vu తన కొత్త గ్లో క్యూఎల్‌ఇడి టీవీ 2025 (డాల్బీ ఎడిషన్) సిరీస్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో 43 అంగుళాల నుండి 75 అంగుళాల వరకు పరిమాణాలు ఉన్నాయి. ఇవి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835, ప్యానెల్‌లు, 400 nits బ్రైట్‌నెస్, 92% NTSC కలర్ రేంజ్, ఫోర్-సైడెడ్ డాల్బీ విజన్ సపోర్ట్‌తో వస్తాయి. ఇవి బడ్జెట్ విభాగంలో అద్భుతమైన ఎంపికగా మారుతాయి.
ఈ టీవీలు మెరుగైన విజువల్స్‌ను మాత్రమే కాదు..గొప్ప ఆడియోను కూడా అందిస్తాయి. ఈ స్మార్ట్ టీవీ 24W డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌తో అమర్చారు. ఫలితంగా ఇది థియేటర్ లాంటి అనుభవాన్ని అందిస్తుంది. స్మార్ట్ ఫీచర్ల గురించి చెప్పాలంటే..ఇది గూగుల్ టీవీ OS, వాయిస్ అసిస్టెంట్, ఇన్‌స్టంట్ నెట్‌వర్క్ రిమోట్ (నెట్‌వర్క్‌కి తక్షణమే కనెక్ట్ అయ్యే స్మార్ట్ రిమోట్), ఆపిల్/ఆండ్రాయిడ్ రెండింటికీ స్క్రీన్ కాస్టింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Vu Glo QLED TV 2025 డాల్బీ ఎడిషన్ ధర:
Vu Glo QLED TV 2025 డాల్బీ ఎడిషన్ ఐదు వేరియంట్లలో లభిస్తుంది. 43-అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ. 24,990గా, 50-అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ. 30,990గా, 65-అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ. 35,990గా, 75-అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ. 50,990గా, 75-అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ. 64,990గా నిర్ణయించారు. ఈ టీవీని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ రిటైలర్ల నుండి కొనుగోలు చేయవచ్చు. అన్ని మోడళ్లకు ఒక సంవత్సరం వారంటీ ఉంటుంది.
Vu Glo QLED TV 2025 డాల్బీ ఎడిషన్ లభ్యత:
ఈ టీవీని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ రిటైలర్ల నుండి కొనుగోలు చేయవచ్చు. కాగా, ఈ టీవీ అన్ని మోడళ్లకు ఒక సంవత్సరం పాటు వారంటీ ఉంటుంది.
Also Read: Smart Tv: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్.. రూ.20 వేల కంటే తక్కువ ధరలో 43 అంగుళాల స్మార్ట్ టీవీలు..
Vu Glo QLED 2025 డాల్బీ ఎడిషన్ ఫీచర్లు:
Vu కొత్త Glo QLED డాల్బీ ఎడిషన్ స్మార్ట్ టీవీ గొప్ప పిక్చర్ , సౌండ్ క్వాలిటీతో వస్తుంది. దీని కారణంగా ఇది ఇంటిని మినీ థియేటర్‌గా మార్చేస్తుంది. ఈ టీవీ 4K అల్ట్రా HD QLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది డాల్బీ విజన్, HDR10 +కి సపోర్ట్ చేస్తుంది. ఇది ప్రకాశవంతమైన, పదునైన, రియల్‌స్టిర్ కలర్స్ ఇస్తుంది. దీనికి గ్లో AI ప్రాసెసర్ ఉంది. ఇది చిత్రాన్ని మరింత మెరుగ్గా చేస్తుంది. ఇక సౌండ్ కోసం ఈ టీవీ 104W స్పీకర్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. దీనిలో డాల్బీ అట్మాస్, 2 మాస్టర్ స్పీకర్లు + 2 ట్వీటర్‌లు ఉన్నాయి. ఫలితంగా ఇవి థియేటర్ లాంటి ఆడియో అనుభవాన్ని అందిస్తాయి.
గూగుల్ టీవీ ప్లాట్‌ఫామ్ కారణంగా ఈ టీవీలో నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి అనేక యాప్‌లను సులభంగా అమలు చేయవచ్చు. దీనికి వాయిస్ సెర్చ్, అంతర్నిర్మిత క్రోమ్ కాస్ట్, గూగుల్ అసిస్టెంట్ మద్దతు కూడా ఉన్నాయి. డిజైన్ పరంగా..ఇది బెజెల్-లెస్‌గా ఉండి, ప్రీమియం లుక్ ను అందిస్తుంది. కనెక్టివిటీ కోసం..ఈ టీవీ HDMI, USB, బ్లూటూత్ 5.0, Wi-Fi మద్దతు వంటి ఫీచర్లను కలిగి ఉంది.


