Xiaomi 17 Pro: షావోమి 17 ప్రో, షావోమి 17ప్రో మాక్స్ చైనా మార్కెట్లో ప్రామాణిక షావోమి 17 హ్యాండ్‌సెట్‌తో పాటు లాంచ్ అయ్యాయి. ఇవి షావోమి బ్రాండ్ తాజా, అత్యంత శక్తివంతమైన ఫోన్లు. ఈ లైనప్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌లు, ఆండ్రాయిడ్ 16-ఆధారిత హైపర్ ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తాయి. ఇటీవల లాంచ్ అయినా ఆపిల్ ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లతో నేరుగా పోటీ పడనున్నాయి. షావోమి ప్రో మోడల్‌లు వెనుక కెమెరా మాడ్యూల్ చుట్టూ సెకండరీ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. ఫోన్‌లు Leica-ట్యూన్ చేయబడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌లతో వస్తాయి. ఇప్పుడు ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
ధర:
షావోమి 17 ప్రో మాక్స్ 12GB + 512GB స్టోరేజీ వేరియంట్ ధర చైనాలో CNY 5,999 (సుమారు రూ. 74,700) నుండి ప్రారంభమవుతుంది. ఇక 16GB + 512GB స్టోరేజీ వేరియంట్ CNY 6,299 (సుమారు రూ. 78,500)గా 16GB + 1TB స్టోరేజీ వేరియంట్ CNY 6,999 (సుమారు రూ. 87,200)గా ఉంది. మరోవైపు, షావోమి 17 ప్రో 12GB + 256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 4,999 (సుమారు రూ. 62,300) నుండి ప్రారంభమవుతుంది. దీని 12GB + 512GB, 16GB + 512GB, 16GB + 1TB వేరియంట్ల ధరలు వరుసగా CNY 5,299 (సుమారు రూ. 66,000), CNY 5,599 (సుమారు రూ. 69,700), CNY 5,999 (సుమారు రూ. 74,700)గా ఉన్నాయి. ప్రో మోడల్స్ బ్లాక్, వైట్, ఊదా, ఆకుపచ్చ రంగులలో అందుబాటులో ఉండనున్నాయి.
also read:Discount: భారీ డిస్కౌంట్‌తో 32 అంగుళాల ఎల్జీ స్మార్ట్ టీవీ..ఇప్పుడే కోనేయండి..
ఫీచర్లు:
షావోమి 17 ప్రో మాక్స్, షావోమి 17 ప్రో వరుసగా 6.9-అంగుళాల, 6.3-అంగుళాల ప్రధాన డిస్ప్లేలను కలిగి ఉన్నాయి.ప్రో మాక్స్ వేరియంట్ 2K రిజల్యూషన్, షావోమి డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ రక్షణతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లు వెనుక భాగంలో సెకండరీ M10 డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. ఇది 3,500 నిట్‌ల ప్రకాశాన్ని అందిస్తుంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు క్వాల్కమ్ 3nm స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతాయి. 16GB వరకు RAM, 1TB వరకు నిల్వతో జత చేశారు. ఇవి ఆండ్రాయిడ్ 16-ఆధారిత హైపర్‌ఓఎస్ 3పై నడుస్తాయి.ఇది డైనమిక్ ఐలాండ్ వంటి హైపర్‌ఐలాండ్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది.
ఫోటోగ్రఫీ కోసం షియోమి 17 ప్రో మాక్స్, షియోమి 17 ప్రో లైకా-ట్యూన్ చేయబడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి. రెండు ఫోన్‌లలో 50MP ప్రైమరీ లైట్ హంటర్ 950L సెన్సార్, 50MP అల్ట్రావైడ్ షూటర్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ (5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో) ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 50MP ఫ్రంట్ కెమెరా అందించారు.
షియోమి 17 ప్రో 6,300mAh బ్యాటరీని కలిగి ఉండగా, ప్రో మాక్స్ వేరియంట్‌లో 7,500mAh బ్యాటరీ ఉంది. రెండూ 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి. ప్రతి హ్యాండ్‌సెట్ 8mm మందం, 192 గ్రాముల బరువు ఉంటుంది. షియోమి 17 ప్రో మాక్స్, షియోమి 17 ప్రో రెండూ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌లను కలిగి ఉన్నాయి. ఇవి 5G, 4G, బ్లూటూత్, Wi-Fi, GPS, NFC, USB టైప్-C కనెక్టివిటీకి మద్దతు ఇస్తాయి.


