Xiaomi Mix Flip 2 Diamond Edition Launchced: షావోమి చైనాలో తన క్లామ్‌షెల్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ మిక్స్ ఫ్లిప్ 2 డైమండ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. కంపెనీ ఈ ఫోన్ మిడ్ ఫ్రేమ్‌లో ల్యాబ్-గ్రోన్ డైమండ్ పొందుపరచింది. ప్రస్తుతం ఒకే ర్యామ్ + స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో వస్తోన్న ఈ పరికరం స్పెసిఫికేషన్లు జూన్ 2025లో రిలీజ్ అయినా పాత మిక్స్ ఫ్లిప్ 2 మోడల్ మాదిరిగానే ఉంటాయి. ఈ హ్యాండ్‌సెట్ ఇతర మార్కెట్‌లకు ఎప్పుడు వస్తుందనే విషయంపై క్లారిటీ లేదు.
Xiaomi Mix Flip 2 Diamond Edition: ధర, డిజైన్
షావోమి ఫమిక్ ఫ్లిప్ 2 డైమండ్ ఎడిషన్ చైనాలో 12GB + 512GB స్టోరేజ్ వేరియంట్ CNY 6,999 (సుమారు రూ. 85,200) ధరతో అందుబాటులో ఉంది. ఇందులో స్పెషల్ ఏంటంటే? కంపెనీ ఈ ఫోన్ మిడ్ ఫ్రేమ్‌లో ల్యాబ్-గ్రోన్ డైమండ్ పొందుపరచింది. ఇది నేషనల్ జెమ్‌స్టోన్ టెస్టింగ్ సెంటర్ (NGTC) ద్వారా నిజమైనదిగా ధృవీకరించబడింది. అంతేకాదు, ఫోన్ వెనుక భాగంలో క్రోకో నమూనాతో కూడిన ఫాక్స్ లెదర్, మెటల్ షావోమి నేమ్‌ప్లేట్ ఉన్నాయి. కాగా, ఈ హ్యాండ్‌సెట్ చెర్రీ రెడ్, గ్లేసియర్ వైట్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. దీనిని షావోమి చైనా వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు.
Xiaomi Mix Flip 2 Diamond Edition: ఫీచర్లు
డిజైన్ తప్ప షావోమి మిక్స్ ఫ్లిప్ డైమండ్ ఎడిషన్ ఫీచర్లన్నీ పాత షావోమి మిక్స్ ఫ్లిప్ 2 మాదిరిగానే ఉంటాయి. ఈ ఫోన్ 6.86-అంగుళాల 1.5K అమోలేడ్ ఫోల్డబుల్ ప్రైమరీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఇది 4.01-అంగుళాల 1.5K అమోలేడ్ కవర్ స్క్రీన్‌ను కూడా కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3,200 నిట్స్ బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. కాగా, ఇది డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ 2.0 రక్షణతో వస్తుంది.
Also Read:Pixel 9 vs Pixel 10: పిక్సెల్ 9 vs పిక్సెల్ 10.. ఏది కొంటె బెటర్ ..?
పనితీరు విషయానికి వస్తే, ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంది. ఇది 12GBRAM+512GB వరకు నిల్వతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15-ఆధారిత హైపర్‌ఓఎస్ 2 పై నడుస్తుంది. ఫోటోగ్రఫీ కోసం, ఇది లైకా-బ్యాక్డ్ డ్యూయల్ అవుట్‌వర్డ్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. దీనిలో 50MP లైట్ హంటర్ 800 ప్రధాన సెన్సార్ (OIS తో), 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ముందు భాగంలో 32MP సెన్సార్ ఉంది.
బ్యాటరీ గురించి మాట్లాడితే, ఫోన్‌లో 5,165mAh బ్యాటరీ ఉంది. ఇది 67W (వైర్డ్), 50W (వైర్‌లెస్) ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది డ్యూయల్ 3D VC కూలింగ్ సిస్టమ్, డాల్బీ అట్మాస్-సపోర్ట్ చేసిన డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా.. ఇందులో 5G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NavIC, NFC, GPS, గెలీలియో, గ్లోనాస్, బీడౌ, USB టైప్-సి అందుబాటులో ఉన్నాయి. ఫోన్ ఓపెన్ చేసినప్పుడు166.89×73.8×7.57mm కొలతలు. 199 గ్రాముల బరువు ఉంటుంది.


