Saturday, November 15, 2025
Homeటెక్నాలజీY19s GT 5G: 50Mp కెమెరా, 5500mAh బిగ్ బ్యాటరీతో Vivo Y19s GT...

Y19s GT 5G: 50Mp కెమెరా, 5500mAh బిగ్ బ్యాటరీతో Vivo Y19s GT 5G లాంచ్!

Y19s GT 5G Launched: వివో తమ వినియోగదారులను ఆకర్షించేందుకు బడ్జెట్ ధరలో ఫోన్లను తీసుకొస్తుంది. కంపెనీ Y19s GT 5G స్మార్ట్ ఫోన్ అధికారికంగా రిలీజ్ చేసింది. దీని Y19s GT 5G పేరిట స్మార్ట్‌ఫోన్‌ను ఇండోనేషియాలో విడుదల చేసింది. అయితే, ఇండియాలో మాత్రం దీని లాంచ్ గురించి అధికారిక ధృవీకరణ లేదు. ఈ స్మార్ట్‌ఫోన్ లో MediaTek Dimensity 6300 చిప్‌సెట్‌, 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, డిజైన్ వంటి కొన్ని ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఈ ఫోన్ కు సంబంధించి ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

- Advertisement -

ధర

ఇండోనేషియాలో ఈ పరికరం 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌ IDR 1,999,000 (సుమారు ₹10,500)గా, 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌కు IDR 2,199,000 గా, 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్‌కు IDR 2,399,000 ధరకు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ జాడే గ్రీన్, క్రిస్టల్ పర్పుల్ వంటి రెండు రంగులలో కొనుగోలుకు లభిస్తోంది.

ఫీచర్లు

Vivo Y19s GT 5G స్మార్ట్ ఫోన్ 6.74-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 570 nits గరిష్ట ప్రకాశంతో వస్తుంది. ఈ మొబైల్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో ఆధారితమైన ఈ ఫోన్ 6GB లేదా 8GB LPDDR4X RAM, 256GB వరకు eMMC 5.1 స్టోరేజ్‌తో వస్తుంది. 6GB లేదా 8GB RAM ఎంపిక కూడా ఉంది. ఇది వేరియంట్‌ను బట్టి మారవచ్చు. మైక్రో SD కార్డ్ ద్వారా నిల్వను 2TB వరకు విస్తరించవచ్చు. భద్రత కోసం, దీనికి సైడ్-ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15ని నడుపుతుంది. ఇది IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది దుమ్ము, తేలికపాటి నీటి స్ప్లాష్‌ల నుండి రక్షిస్తుంది. కెమెరా గురించి మాట్లాడితే..Y19s GT 5G పంచ్-హోల్ కటౌట్‌లో 5-మెగాపిక్సెల్ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. వెనుక భాగంలో ఇది 50-మెగాపిక్సెల్ డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

Also Read: Laptops under 13K: పిచ్చెక్కించే ఆఫర్స్..కేవలం రూ.13 వేల కంటే తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌లు..

ఈ ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే..ఫోన్ 15W వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. కనెక్టివిటీ పరంగా చూస్తే.. ఇందులో డ్యూయల్ సిమ్, 5G, Wi-Fi 5, బ్లూటూత్ 5.2, NFC, USB-C పోర్ట్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పరికరం కొలతలు 167.30 x 76.95 x 8.19 mm. బరువు 199 గ్రాములు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad