Bomb Threat to city civil court: హైదరాబాద్‌లోని నాంపల్లి సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టినట్లు ఓ వ్యక్తి పంపిన ఈ మెయిల్ కోర్టు ప్రాంతంలో తీవ్ర కలకలాన్ని రేపింది. వెంటనే ఈ సమాచారం అందుకున్న పోలీసులు కోర్టు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. కోర్టులోని మొత్తం సిబ్బందిని బయటకు పంపించారు.
- Advertisement -

బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లను రంగంలోకి దింపి కోర్టు ప్రాంగణాన్ని జల్లెడపట్టి తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా ప్రధాన న్యాయమూర్తి కోర్టు గదిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతుండగా, ఇప్పటివరకు బాంబ్‌కు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. పూర్తి తనిఖీలు పూర్తయ్యే వరకు అధికారుల నుంచి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.


