Thursday, March 13, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Virinchi Hospital: విరించి ఆసుపత్రిలో.. ఘనంగా ప్రపంచ కిడ్నీ దినోత్సవం..!

Virinchi Hospital: విరించి ఆసుపత్రిలో.. ఘనంగా ప్రపంచ కిడ్నీ దినోత్సవం..!

విరించి పీపుల్స్ హాస్పిటల్ వాళ్ళు ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని… ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న వారి కుటుంబాలతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నెఫ్రాలజీ విభాగం సాధించిన విజయాల గురించి ప్రత్యేకంగా వివరించారు. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉన్నాయా అని అందరినీ ప్రశ్నిస్తూ, నెఫ్రాలజీ రంగంలో వాళ్ళు ఎంత కృషి చేస్తున్నారో తెలియజేశారు. అంతేకాకుండా, రోగులకు వాళ్ళు అందిస్తున్న ప్రత్యేక చికిత్సల గురించి కూడా వివరించారు. డాక్టర్ కె.ఎస్ నాయక్, డాక్టర్ నవీన్ కుమార్ మాట్టేవాడ, డాక్టర్ రవి కుమార్ వంటి అనుభవజ్ఞులైన వైద్యుల నేతృత్వంలోని నెఫ్రాలజీ విభాగం, కిడ్నీ సంరక్షణలో అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తూ, అద్భుతమైన ఫలితాలను అందిస్తోందని వారు తెలిపారు.

- Advertisement -

ఈ సంవత్సరం ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా, మీ మూత్రపిండాలు సరిగ్గా పనిచేస్తున్నాయా అని ప్రశ్నిస్తూ, ముందస్తు జాగ్రత్తల గురించి అందరికీ అవగాహన కల్పించారు. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని, అందుకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలను తాము అందిస్తున్నామని విరించి పీపుల్స్ హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. మూత్రపిండాల సంరక్షణకు, చికిత్సకు విరించి హాస్పిటల్ ప్రత్యేక చికిత్సలను అందిస్తోంది. డయాలసిస్ అవసరాన్ని తగ్గించడం లేదా పూర్తిగా నివారించడం కోసం కృషి చేస్తున్నామని వారు చెప్పారు.

పెరిటోనియల్ డయాలసిస్ (పిడి) విషయంలో అంతర్జాతీయంగా విరించి హాస్పిటల్ ముందంజలో ఉందని తెలిపారు. ఇంటి వద్దనే డయాలసిస్ చేసుకునేలా రోగులకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కాథెటర్ వేసిన 12 గంటల్లోపే పెరిటోనియల్ డయాలసిస్ ఇంటి వద్దనే చేసుకునేలా చేయడంలో విరించి ముందుందని తెలిపారు. ఈ పద్ధతిని ఇటీవల జరిగిన వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ నెఫ్రాలజీ 2025లో ప్రదర్శించామని తెలిపారు.

భారతదేశంలో మొట్టమొదటిసారిగా అంతరాష్ట్ర, ఇంటర్ హాస్పిటల్ స్వాప్ కిడ్నీ మార్పిడి చేయడం ద్వారా విరించి హాస్పిటల్ చరిత్ర సృష్టించిందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.. జీవన దాతలు దొరకని రోగులకు, మరొక కుటుంబంతో దాతలను మార్పిడి చేసుకునే అవకాశం ఈ పద్ధతి ద్వారా సులభతరం అవుతుంది. దేశవ్యాప్తంగా స్వాప్ మార్పిడి కార్యక్రమాన్ని విస్తరించడానికి ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (ఐసోట్) తో కలిసి పనిచేస్తున్నట్లు విరించి ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది.

విరించి ఆసుపత్రి ఇప్పటికే అనేక సంక్లిష్టమైన మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసింది. తల్లి నుండి కొడుకుకు, భార్య నుండి భర్తకు ABO అననుకూల మూత్రపిండ మార్పిడి, బయాప్సీ-నిరూపితమైన త్రోంబోటిక్ మైక్రోఅంజియోపతితో ఉన్న రోగికి మూత్రపిండ మార్పిడి వంటివి ఇందులో ఉన్నాయి. భారతదేశంలోనే మొదటిసారిగా ఒకే సమయంలో కిడ్నీ, హృదయ అవయవ మార్పిడి. ఒకే దాత నుండి కాలేయం, తర్వాత మూత్రపిండం మార్పిడి వంటి అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించింది. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా, ప్రపంచ స్థాయి సేవలను అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని విరించి పీపుల్స్ హాస్పిటల్ తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News