Sunday, January 19, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Gandhi hopsital CPR training: గాంధీలో సీపీఆర్​ ట్రైనింగ్​ షురూ

Gandhi hopsital CPR training: గాంధీలో సీపీఆర్​ ట్రైనింగ్​ షురూ

ఇది అత్యవసర సేవ

గుండెపోటు వచ్చిన సమయంలో ఫస్ట్ ఎయిడ్​ గా అత్యవసరంగా నిర్వహించే సీపీఆర్​ (కార్డియో ఫల్మనరి రిససిటేషన్​) ఎలా చేయాలో తెలిపే కమ్యూనిటీ సీపీఆర్​ ట్రైనింగ్​ సికింద్రాబాద్​ గాంధీ మెడికల్ కాలేజీ అలుమ్మి భవనంలో ప్రారంభమైంది.

- Advertisement -

మూడు రోజుల

మూడు రోజుల పాటు జరిగే సీపీఆర్​ ట్రైనింగ్​ క్యాంప్​ ను అలుమ్ని వ్యవస్థాపక అధ్యక్షుడు డా.రాజిరెడ్డి, కార్యదర్శి డా.చంద్రశేఖర్​, గాంధీ మెడికల్​ కాలేజీ ప్రిన్సిపాల్​ డా.కే. ఇందిర ప్రారంభించారు. గాంధీ మెడికల్ కాలేజీ అలుమ్ని అసోసియేషన్​, గ్లోబల్​ అలయెన్స్​, జనహిత సేవా ట్రస్ట్ ప్రతినిధులు సీపీఆర్​ ట్రైనింగ్ క్యాంప్​ ను ఆర్గనైజ్​ చేశారు. గత నాలుగేళ్ళుగా తమ ఆధ్వర్యంలో చేస్తున్న సీపీఆర్​ ట్రైనింగ్ క్యాంపులో 30,000 పైగా వివిధ రంగాల్లోని వారికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

అన్ని రంగాల వారికి ట్రైనింగ్

ఇందులో డాక్టర్లు, నర్సులు, పోలీసులు, ఆటో డ్రైవర్లు, ట్రాఫిక్​ సిబ్బంది, ఇంటర్​, డిగ్రీ, ఇంజినీరింగ్ స్టూడెంట్లు, 108 సిబ్బంది ఉన్నారని అన్నారు. హార్ట్​ ఎటాక్​ వచ్చిన సమయంలో వ్యక్తికి అత్యవసరంగా గోల్డెన్​ హవర్స్​ గా పరిగణించే ఆ టైమ్​ లో కొన్ని నిమిషాల పాటు ఛాతీ భాగంలో సీపీఆర్​ చేస్తే, ప్రాణపాయం నుంచి బయట పడే అవకాశం ఉంటుందన్నారు. ఆసుపత్రికి తీసుకెళ్ళే ముందుగా సీపీఆర్​ చేసిన గత సందర్భాల్లో చాలామంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని వారు గుర్తు చేశారు.

ట్రైనింగ్ గంటే, అందరూ నేర్చుకోండి

సీపీఆర్​ ట్రైనింగ్ ఒక గంట పాటు ఉంటుందని, ఇందులో మానవ బొమ్మపై ప్రాక్టికల్​ తో పాటు థియరీ క్లాస్​ నిర్వహించారు. ఉచితంగా నిర్వహించే ఈ సీపీఆర్ ట్రైనింగ్ లో ప్రతి రంగానికి చెందిన పౌరులు పాల్గొని, శిక్షణ పొందాలని వారు కోరారు. ప్రతి ఒక్కరు సీపీఆర్​ నేర్చుకుంటే గుండెపోటు వచ్చిన అత్యవసర సమయంలో ఎదుటి వారి ప్రాణాలను కాపాడే వైద్యులు అవుతారని, మరోజన్మ ప్రసాదించిన దేవుళ్ళుగా అందరూ మిమ్మల్ని గుర్తుంచుకుంటారని నిర్వాహకులు చెప్పారు.

కార్యక్రమంలో గాంధీ మెడికల్​ కాలేజీ అలుమ్ని అసోసియేషన్​ ప్రెసిడెంట్​ డా. జీఆర్​ లింగమూర్తి, గ్లోబల్​ అలుమ్ని ట్రస్టీ డా.రవీందర్​ సురకంటి, సెక్రటరీ కొలిపాక డా.రాజశేఖర్​, ఇంటర్నేషనల్​ ట్రైనింగ్​ సెంటర్​ కో ఆర్డినేటర్​ డా.మహేశ్వర్​ రెడ్డి, అమెరికా హార్ట్​ అసోసియేషన్​ ఇంచార్జీ డా. డెనిస్​ మెకాలే(చికాగో) జనహిత సేవాట్రస్ట్ నిర్వహకులు నరసింహామూర్తి, ఎన్​ఎస్​ఎస్​ వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News