Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Gate 2026 Exam: గేట్ 2026 పరీక్ష తేదీలు విడుదల: దరఖాస్తులు త్వరలో ప్రారంభం..!

Gate 2026 Exam: గేట్ 2026 పరీక్ష తేదీలు విడుదల: దరఖాస్తులు త్వరలో ప్రారంభం..!

Exam Dates of Gate 2026: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE 2026) పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాది గేట్ పరీక్ష నిర్వహణ బాధ్యతను ఐఐటీ గువాహటి తీసుకుంది.
ముఖ్యమైన తేదీలు:
* ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: ఆగస్టు 25, 2025
* దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 25, 2025
* లేట్ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 6, 2025
* పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 7, 8, 14, 15, 2026
* ఫలితాల విడుదల: మార్చి 19, 2026
పరీక్ష వివరాలు:
గేట్ పరీక్ష మూడు గంటల పాటు జరుగుతుంది. ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)గా దేశవ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తారు. ప్రస్తుతానికి బీటెక్ మూడో సంవత్సరంలో చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పరీక్ష రాయడానికి అర్హులు. ఒక అభ్యర్థి ఒక దరఖాస్తును మాత్రమే సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
* మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఒక్కో పేపర్‌కు రూ. 1,000.
* ఇతర కేటగిరీల అభ్యర్థులు, విదేశీ విద్యార్థులకు ఒక్కో పేపర్‌కు రూ. 2,000.
ఈ పరీక్షల షెడ్యూల్‌లో కొన్ని సందర్భాల్లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు ఐఐటీ గువాహటి తెలిపింది. అధికారిక నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం గేట్ 2026 అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad