Tuesday, January 14, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Hyderabad Kite Fest: ప్రారంభమైన కైట్ ఫెస్టివల్

Hyderabad Kite Fest: ప్రారంభమైన కైట్ ఫెస్టివల్

పతంగుల పండుగ

హైదరాబాద్ లో కైట్ ఫెస్టివల్ ప్రారంభమైంది. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఏటా జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఈ ఏడాది మూడు రోజులపాటు సాగనుంది.

- Advertisement -

సంక్రాంతి పండ‌గ సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13, 14, 15వ తేది వ‌ర‌కు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 7వ అంత‌ర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివ‌ల్ ను ప‌ర్యాట‌క, సాంస్కృతిక‌ శాఖ‌ నిర్వహిస్తోంది.  ఈ సంవత్సరం కైట్ ఫెస్టివల్ కు మూడు రోజుల్లో 15 లక్షల మంది దాకా వస్తారని అంచనా ఉంది. హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా అంత‌ర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివ‌ల్‌ నిర్వహించేందుకు సన్నాహాలు సాగాయి.

16 దేశాల నుంచి

ఈ ఉత్సవాలలో 16 దేశాల నుంచి 47 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, 14 రాష్ట్రాల నుంచి 60 దేశవాళీ కైట్ క్లబ్ సభ్యులు, పాల్గొని పలు డిజైన్లలో రూపొందించిన పతంగులను ఎగుర వేస్తున్నారు. వీటితో పాటు జాతీయ‌, అంతర్జాతీయ స్వీట్లను, తెలంగాణ పిండి వంట‌ల‌ను స్టాళ్లలో అందుబాటులో ఉంచారు.

రాబోయే రోజుల్లో కైట్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ను పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News