Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Leopard in Hyderabad: హైదరాబాద్ శివారులో చిరుత సంచారం.. ప్రజల్లో భయాందోళన

Leopard in Hyderabad: హైదరాబాద్ శివారులో చిరుత సంచారం.. ప్రజల్లో భయాందోళన

Leopard in hyderabad: హైదరాబాద్ శివారు ప్రాంతాల ప్రజలు ఇటీవల చిరుతల సంచారంతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఎటువైపు నుంచి దాడి చేస్తుందోనన్న భయం వారిని వెంటాడుతోంది. గత 20 రోజుల్లో మూడు కీలక ప్రాంతాల్లో చిరుతలను గుర్తించారు.

- Advertisement -

గోల్కొండ పరిసర ప్రాంతాల్లో మళ్లీ చిరుత కనిపించింది. రాందేవ్ గూడలోని మిలిటరీ ఏరియాలో చిరుత రోడ్డు దాటడం ట్రాక్ కెమెరాలో రికార్డు అయ్యింది. టెక్ పార్క్ నుంచి మిలిటరీ ఏరియాలోకి వెళ్ళిన చిరుత, తెల్లవారుజామున తిరిగి టెక్ పార్క్‌లోకి ప్రవేశించిన దృశ్యాలు కెమెరాల్లో నమోదయ్యాయి.

చిరుత సంచారంతో మంచిరేవుల, గండిపేట, నార్సింగి, బైరాగిగూడ, గంధంగూడ, నెక్నాంపూర్, ఇబ్రహీంబాగ్, రాందేవ్ గూడ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అయితే, చిరుతను పట్టుకోవడానికి బోన్లు, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. చిరుత అటవీ ప్రాంతంలోనే తిరుగుతోందని, జనావాసాల్లోకి రావడం లేదని వారు స్పష్టం చేశారు. చిరుతపై నిఘా ఉంచామని, ప్రత్యేక బృందాలు దాని కోసం వెతుకుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

గతంలో జూలై 24న గండిపేటలోని గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్‌లో చిరుత కనిపించింది. అంతకుముందు జూలై 11న బాలాపూర్‌లోని డిఫెన్స్ లేబొరేటరీస్‌లో ఏకంగా రెండు చిరుతలు దర్శనమిచ్చాయి. హైదరాబాద్ శివారుల్లో చిరుతలు తరచుగా కనిపించడం, అది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రక్షణ రంగానికి చెందిన సంస్థల పరిసరాల్లోనో, సమీపంలోనో ప్రత్యక్షమవడం ఆసక్తికరంగా మారింది. ఈ ప్రాంతాల్లో సహజంగా అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది.

సోమవారం గోల్కొండలోని మిలిటరీ క్యాంప్ దగ్గర ఇబ్రహీంబాగ్ వద్ద రోడ్డుపై తిరుగుతున్న చిరుతను బైక్‌పై వెళ్తున్న ఒక వ్యక్తి గుర్తించి అటవీశాఖకు సమాచారం అందించారు. దీంతో ఆ ప్రాంత ప్రజల్లో వణుకు మొదలైంది. గత 20 రోజులుగా శివారు ప్రాంతాల్లో చిరుతలు తరచుగా కనిపిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం గండిపేట సమీపంలోని గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్‌లో కనిపించిన చిరుతను పట్టుకోవడానికి ట్రాప్ కెమెరాలు పెట్టినా ఇప్పటివరకు దాని ఆచూకీ లేదు. ఇప్పుడు గోల్కొండలో కనిపించిన చిరుత అదేనా లేక వేరేదా అనేది తేలాల్సి ఉంది.

ఇక ఈ నెల 11న బాలాపూర్‌లోని ఏపీజే అబ్దుల్ కలాం డిఫెన్స్ లేబొరేటరీస్ రీసెర్చ్ సెంటర్‌లో ఒకటి కాదు.. ఏకంగా రెండు చిరుతలు కనిపించాయి. ఈ ప్రాంతాలన్నీ రక్షణ రంగానికి సంబంధించినవి. సహజంగా అక్కడ ఎక్కువగా అటవీ స్థలం ఉంటుంది. సుమారు 60 కిలోమీటర్ల పరిధిలో సంచరించే చిరుతలు ఒకటి, రెండేనా లేక ఇంకా ఉన్నాయా అన్న భయంతో ప్రజలు వణికిపోతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad