జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills) ప్రచారంలో భాగంగా బోరబండలో తలపెట్టిన కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్‌కి పోలీసులు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేశారు. బోరబండ సైట్3లో బండి సంజయ్ సభకు ఈ పర్మిషన్ ఇచ్చారు. తొలుత ఆయన మీటింగ్‌కి పర్మిషన్ ఇవ్వకపోవంతో పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణుల ఉదయం నుంచి మండిపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తమపై కుట్రలు చేస్తోందని, కనీసం ప్రచారం చేసుకోనివ్వకుండా పర్మిషన్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలోనే మళ్లీ సభకు అనుమతిని మంజూరు చేసింది. దీనిని భాజపా వర్గాలు స్వాగతిస్తున్నాయి.
తారాస్థాయికి చేరుకున్న ప్రచారం: ఉపఎన్నికలో భాగంగా ప్రధాన పార్టీలు తమ కీలక నాయకులతో ప్రతి గల్లీలో ప్రచారం చేస్తున్నాయి. తొలుత క్యాండిడేట్‌ని ప్రకటించిన భారాసా ఇప్పటికే పలు బూత్‌లలో ప్రచారం పూర్తి చేసుకుంది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతి వాడలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నాయకులతో జూబ్లీహిల్స్‌లోని ప్రతి కాలనీలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక బీజైపీ సైతం ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నాయి.
అయితే ఓటరు మహాశయులు ఏపార్టీ వైపు ఉంటారో అని ఆసక్తి నెలకొంది. ఇక్కడ త్రిముఖ పోరు ఉంటుందని కొందరూ భావిస్తుండగా మరికొందరు కేవలం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు. మాగంటి గోపి జూబ్లీహిల్స్‌కి చేసిన సేవలు, ప్రభుత్వంపై వ్యతిరేకత కలిసి వస్తుందని బీఆర్‌ఎస్ భావిస్తోంది. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇతర ప్రభుత్వ విధానాలు మెచ్చి జనాలు తమకే మొగ్గు చూపుతారనే ధీమాతో అధికార కాంగ్రెస్ ఉంది.
ఎలాగైనా ఈ ఎన్నికల్లో గట్టి పోటీని ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, మోదీ నాయకత్వ వంటివి తమకు కలిసి వస్తాయని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికార కాంగ్రెస్‌కి, సిట్టింగ్ బీఆర్‌ఎస్‌కి చెక్ పెడతామని ధీమాతో బీజేపీ ఉంది. అందుకు తగినట్లుగానే పక్కా వ్యూహాలతో ఈ ఎన్నికల బరిలో ఆ పార్టీ దూసుకెళ్తోంది. అయితే ఏ పార్టీ వైపు ఓటర్లు ఉంటారనే విషయం తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే.


