Sarath City Capital Mall in Hyderabad: ఇప్పుడు ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూస్తోంది. ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే చెన్నై, బెంగళూరు, పుణె వంటి నగరాల వైపు ఆసక్తి చూపించేవారు. కానీ ఇప్పుడు ఐటీ కారిడార్‌కి కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాద్ మారింది. గత దశాబ్ద కాలంలో హైదరాబాద్‌లో ఐటీ రంగంలో చోటుచేసుకున్న విప్లవాత్మకమైన మార్పులే కారణం. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తమ ఫేవరెట్ సిటీగా భాగ్యనగరానికే ఓటేస్తున్నారు. గ్లోబల్ కంపెనీలన్నీ క్యూ కట్టినట్లుగా హైదరాబాద్‌లో కొలువు దీరాయి. ఈ ఫలితంగా మహానగర చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందింది. ఎంటర్‌టైన్‌మెంట్, షాపింగ్, ఆటలు, ఇలా ఒకటేమిటి అన్ని హంగులతో విశాలమైన స్థలాల్లో షాపింగ్ మాల్స్ పుట్టుకొచ్చాయి. ఫలితంగా ఇప్పుడు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్.. దేశంలోనే అతిపెద్ద షాపింగ్‌మాల్స్‌లో ఒకటిగా స్థానం సంపాదించుకుంది.
Also Read: https://teluguprabha.net/telangana-news/cybercrime-police-blocked-ibomma-and-bappam-websites/
నివేదికల ప్రకారం హైదరాబాద్‌లోని ‘శరత్ సిటీ క్యాపిటల్ మాల్’ భారత్‌లోని మొదటి ఐదు అతిపెద్ద మాల్స్‌లో ఒకటిగా నిలిచింది. రిటైల్ దిగ్గజాలలో 5వ స్థానాన్ని దక్కించుకుంది. దాదాపు 27 లక్షల చదరపు అడుగుల స్థలంలో, 19 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్ మాల్ విశాలంగా రూపుదిద్దుకుంది. ఢిల్లీలోని DLF మాల్ ఆఫ్ ఇండియా, కేరళలోని లులు మాల్ వంటి మాల్స్‌కి గట్టి పోటీనిచ్చింది. ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, గృహాలంకరణ వంటి రంగాల్లో వందలాది బ్రాండ్‌లను శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో చూడవచ్చు.
వీటితో పాటు ఈ మాల్‌లో రెండు విస్తారమైన ఫుడ్ కోర్టులు, మల్టీ ఫైన్-డైనింగ్ అవుట్‌లెట్‌లు, మల్టీప్లెక్స్, గేమింగ్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ ఉన్నాయి. మల్టీ- లెవెల్ లేఅవుట్ లగ్జరీ నుంచి బడ్జెట్ ధర వరకు ఇక్కడ అన్నీ అందుబాటులో ఉన్నాయి. షాపింగ్, డైనింగ్‌తో పాటు ఇక్కడ మరిన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవే ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. ఈవెంట్‌లు, పాప్-అప్‌లు, సాంస్కృతిక ప్రదర్శనలు ఇక్కడ తరచూ జరుగుతుంటాయి. ఫ్లీ మార్కెట్‌లు, ఆర్టిసానల్ పాప్-అప్‌లు, ఫుడ్ ఫెస్టివల్స్, ఫిట్‌నెస్ వర్క్‌షాప్‌లు, టెక్ ఎక్స్‌పోలు, చిరు వ్యాపార ప్రదర్శనలు నిర్వహించడానికి ఇక్కడ ఆస్కారం ఉంది.
శరత్ సిటీ క్యాపిటల్ మాల్ కేవలం రిటైల్ కేంద్రంగా మాత్రమే కాకుండా వ్యాపార విస్తరణకు, ఔత్సాహికులకు ఓ వేదికగా మారింది. కొత్త బ్రాండ్‌లు, ట్రెండింగ్‌ను కోరుకునే వారికి ఈ మాల్ బెస్ట్ ప్లేస్. ఇక వీకెండ్స్‌లో చిల్ అవ్వాలనుకునేవారికి శరత్ సిటీ క్యాపిటల్ మాల్ ఫేవరెట్ ప్లేస్. ఫలితంగా ఇండియాలోనే అతి పెద్ద షాపింగ్ మాల్స్‌లో ఒకటిగా నిలిచింది.


