Sunday, November 16, 2025
HomeTS జిల్లా వార్తలుKarimnagar: ఐజేయూ కరీంనగర్ శాఖ ఎన్నికలకు భారీగా నామినేషన్లు

Karimnagar: ఐజేయూ కరీంనగర్ శాఖ ఎన్నికలకు భారీగా నామినేషన్లు

99 నామినేషన్లు

ఈనెల 11వ తేదీన జరగనున్న టీయూడబ్ల్యూజే (ఐజేయూ) కరీంనగర్ జిల్లా శాఖ ఎన్నికల్లో వివిధ పదవులకు పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున 99 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

- Advertisement -

ఆదివారం కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో నామినేషన్ల పర్వం ప్రారంభం అయ్యింది. అధ్యక్ష స్థానానికి ఏడుగురు, కార్యదర్శి స్థానానికి ఏడుగురు, 3 ఉపాధ్యక్ష స్థానాలకు 17 మంది, సహాయ కార్యదర్శి 3 స్థానాలకు 18 మంది, కోశాధికారి స్థానానికి ఐదుగురు అభ్యర్థులు, జిల్లా కార్యవర్గ సభ్యులు 16 స్థానాలకు 45 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారి బుర్ర సంపత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ 8వ తేదీ సాయంత్రం నామినేషన్ల పర్వం ముగిసిందని తెలిపారు. 9వ తేదీన ఉదయం పదిగంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుందని, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామిషర్ల ఉపసంహరణకు గడువు విధించామని తెలిపారు.

ఈ ఎన్నికకు సంబంధించి మొత్తం పోస్టులకు ఏకగ్రీవం కానట్లయితే 11వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు శ్రీ తాపాల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ఫంక్షన్ హాల్ ఎల్ఎండి కాలనీలో పోలింగ్ జరగనున్నదని తెలిపారు. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు. ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు, జిల్లా అడహక్ కమిటీ కన్వీనర్ నగునూరి శేఖర్ నామినేషన్ల ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ ఎన్నికలకు సహాయ అధికారులుగా ఎలగందుల రవీందర్, దూలూరి జగన్మోహన్ వ్యవహరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad