జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని అక్షర కాన్సెప్ట్ హైస్కూల్ లో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి. అమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో అక్షర కాన్సెప్ట్ హైస్కూల్ ప్రైమరీ స్కూల్ ప్రాంగణంలో పాఠశాల కరస్పాండెంట్ పడాల రేణుక జగదీష్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల హరిదాసు వేషధారణ, కీర్తనలు, భోగి పండ్లు, భోగిమంటలు తదితర కార్యక్రమాలతో పాఠశాల ప్రాంగణం సంక్రాంతి శోభను సంతరించుకుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత, కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డిలు విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పోటీలలో పాల్గొన్న మహిళలకు కన్సొలేషన్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ పుష్పలత మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ఇంటికి చేర్చుకునే ఉత్సాహంతో జరుపుకునే పండుగ సంక్రాంతి అని పండుగ విశిష్టతను వివరించారు.
కార్యక్రమంలో కౌన్సిలర్ ఉమా శంకర్ గౌడ్, నాయకులు నరసింహులు, శివకుమార్ పరమటయ్య, చెన్నయ్య, పాఠశాల ప్రిన్సిపల్ మోహినోదిన్, వైస్ ప్రిన్సిపల్ జ్యోతి, వనజ, అనిత, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.