Sexual assault on a minor: మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జడ్చర్ల లోని ఓ గ్రామంలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. తల్లితో కలిసి కట్టెల కోసం వెళ్లిన ఓ ఏడేళ్ల బాలికపై.. ఆమె తల్లి లేని సమయం చూసి ఓ పదహారేళ్ల బాలుడు లైంగికదాడికి పాల్పడ్డాడు.
బాలికను పొదల్లోకి లాక్కెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాలికను.. ఎవరికైనా చెబితే తనను చంపేస్తానని ఆ బాలుడు బెదిరించినట్లు సమాచారం.ఇంటికి వెళ్ళాకా కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను చూసిన తల్లి.. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ అసలు విషయం బయటపడడంతో పోలీసులులకి ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
మైనర్లు నేరాలకు పాల్పడటానికి కారణాలు:
ఇంటర్నెట్, పోర్నోగ్రఫీ ప్రభావం.
మానసిక విజ్ఞాన లోపం.
తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం.
స్వీయ నియంత్రణ లేకపోవడం.
మితిమీరిన పబ్‌కల్చర్, సినిమాల ప్రభావం.
మైనర్ లైంగిక దాడికి పాల్పడితే ఏం జరుగుతుంది?
1. వయస్సును బట్టి విచారణ:
16 ఏళ్లు కన్నా తక్కువ వయసు అయితే: అతన్ని బాలుడిగా (child in conflict with law)గా పరిగణించి జువెనైల్ హోమ్‌కు పంపుతారు.16 ఏళ్లు పైబడితే, తీవ్రమైన నేరం అయితే (లైంగిక దాడి, అత్యాచారం వంటివి): జువైనైల్ జస్టిస్ బోర్డు (JJB) ముందుగా అతని మానసిక స్థితి, వివేకబుద్ధి ఆధారంగా విచారణ చేస్తుంది. అది తేల్చిన తరువాత వయోజనంగా శిక్ష విధించే అవకాశముంది.
2. POCSO చట్టం కింద కేసు:
మైనర్ అయినా, లైంగిక దాడి కేసులు POCSO (Protection of Children from Sexual Offences Act, 2012) చట్టం కింద నమోదవుతాయి. ఈ చట్టం లైంగిక నేరాల విషయంలో చాలా కఠినంగా ఉంటుంది.
జువైనైల్‌గా దోషిగా తేలితే సాధారణంగా 3 సంవత్సరం వరకు జువెనైల్ రీఫార్మ్ హోంలో ఉంచుతారు. వయోజనంగా శిక్ష విధిస్తే అప్పుడప్పుడు సాధారణ జైలు శిక్ష కూడా విధించవచ్చు.