Saturday, April 5, 2025
HomeTS జిల్లా వార్తలునిర్మల్Basara: పోలీసు దిగ్బంధంలో బాసర ట్రిపుల్ ఐటి

Basara: పోలీసు దిగ్బంధంలో బాసర ట్రిపుల్ ఐటి

టెన్షన్ టెన్షన్

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి తో పాటు బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలన్నీ పోలీసు దిబ్బంధంలో చిక్కుకున్నాయి. ఎటు చూసినా పోలీస్ పహారా కనిపిస్తోంది. ఇటీవల బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థిని స్వాతి ప్రియ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలపై సెక్యూరిటీ సిబ్బంది చేయి చేసుకున్న ఉదంతం తెలిసిందే.

- Advertisement -

ఈ నేపథ్యంలో రాష్ట్ర ఏబీవీపీ శాఖ త్రిపుల్ ఐటీ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. వివిధ ప్రాంతాల నుంచి బాసరకు రానున్న ఏబీవీపీ కార్యకర్తలను చేరుకోకుండా పోలీసు బలగాలు మోహరించాయి. బాసరకు చేరుకున్న యువతను ప్రశ్నలతో విసిగించి సంతృప్తి చెందాకే బయటకు అనుమతిస్తున్నారు. అయినా కొంతమంది ఏబీవీపీ కార్యకర్తలు పోలీసుల కళ్ళు కప్పి బాసర త్రిపుల్ ఐటీ చేరుకుని గోడ పైనుండి లోపలికి దూకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు.
ముట్టడిలో పాల్గొనేందుకు వచ్చిన కార్యకర్తలను అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News