Telangana Rain Alert: తెలంగాణలో నీట మునిగే పరిస్థితి! ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం … రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు, రేపు రెడ్ అలర్ట్ జారీ చేశారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, హనుమకొండ, ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్ తదితర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉంది.
ALSO READ: https://teluguprabha.net/news/red-alert-heavy-rains/
రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని నాగరత్న తెలిపారు. ఉత్తర తెలంగాణలో ఆగస్టు 17న వర్ష తీవ్రత మరింత ఎక్కువగా ఉండవచ్చు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ వర్షాలకు కారణం. హైదరాబాద్‌లో ఈ రోజు రెడ్ అలర్ట్, రేపు ఆరెంజ్ అలర్ట్ ఉంది. GHMC పరిధిలో భారీ వర్షాలు, వరదల ప్రమాదం ఉంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం లేకపోతే బయటకు రాకపోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. తక్కువ ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉన్నందున, రహదారులపై జాగ్రత్తగా ఉండాలి. విద్యుత్, రవాణా సౌకర్యాల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. తాజా వాతావరణ సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్లను సంప్రదించండి.


