Sunday, November 16, 2025
HomeTS జిల్లా వార్తలుKhammam: "సాయితేజ మృతదేహాన్ని త్వరగా ఇండియాకు రప్పిస్తాం"

Khammam: “సాయితేజ మృతదేహాన్ని త్వరగా ఇండియాకు రప్పిస్తాం”

Khammam| అమెరికాలో జరిగిన కాల్పుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన సాయితేజ అనే విద్యార్థి మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుడి కుటుంబసభ్యులను ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి(Ramasahayam Raghuram Reddy)ఫోన్‌లో పరామర్శించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ ద్వారా ఫోన్‌లో విద్యార్థి తండ్రి నూకారపు కోటేశ్వరరావుతో ఎంపీ మాట్లాడారు.

- Advertisement -

నాలుగు నెలల క్రితమే అమెరికా వెళ్లిన తన కొడుకు ఇలా అర్థాంతరంగా మృతి చెందడంతో విలపిస్తున్న తండ్రిని ఆయన ఓదార్చారు. మృతుడి కుటుంబ సభ్యులందరికీ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమెరికాలో ఉన్న సాయితేజ మృతదేహాన్ని ఇండియాకు త్వరగా రప్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో మాట్లాడతానని తెలిపారు.

కాగా ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన సాయి తేజ(22) మూడు నెలల క్రితం ఎంఎస్ చదవడానికి అమెరికా వచ్చాడు. ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తూ చదువుకుంటున్నాడు. అయితే శనివారం ఉదయం కొంతమంది దుండగులు మాల్‌లోకి ప్రవేశించి సాయితేజపై కాల్పులు జరిపి నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో అతడు స్పాట్‌లోనే మృతి చెందాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad