Sunday, November 16, 2025
HomeTS జిల్లా వార్తలుStanley College: స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్‌లో వర్క్‌షాప్ ఎక్స్‌పో - 2025

Stanley College: స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్‌లో వర్క్‌షాప్ ఎక్స్‌పో – 2025

Stanley College: స్టాన్లీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్‌లో శనివారం వర్క్‌షాప్ ఎక్స్‌పో – 2025ను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ కె. రాజేష్ (అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ కన్వీనర్) పర్యవేక్షణలో జరిగిన వర్క్ షాప్ ఎక్స్‌పోలో 100 మందికి పైగా విద్యార్థులు తమ ప్రాజెక్టు నమూనాలను ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ ఎల్. శివరామకృష్ణ (డైరెక్టర్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం) మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సమాజ అవసరాలను తీర్చడానికి ఆలోచనా విధానం, సామర్థ్యం కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థులు కనుగొనే ప్రతి చిన్న ఆవిష్కరణ, నమూనా సమాజ పురోగతికి దోహదపడాలని ప్రొఫెసర్ శివరామ కృష్ణ ఆకాంక్షించారు. సైద్ధాంతిక జ్ఞానంపై దృష్టి పెట్టడమే కాకుండా, ఆవిష్కరణల ద్వారా ఆచరణాత్మక అనువర్తనాలను మెరుగుపరచుకోవాలని విద్యార్థులకు సూచించారు.

ప్రస్తుతం దేశంలో యువ ఇంజినీర్లకు అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, సస్టైనబుల్ డెవలప్‌మెంట్, గ్రీన్ ఎనర్జీ వంటి జాతీయ కార్యక్రమాలలో యువ ఇంజనీర్లు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు.


విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలలో రోబోటిక్ టెక్నాలజీ, సెక్యూరిటీ డిటెక్టర్లు, రీఛార్జబుల్ మెషీన్లు, సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లు, ఎలక్ట్రిక్ కార్ మోడల్స్, డ్రోన్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్ టెక్నాలజీ అందరినీ ఆకర్షించాయి. అనంతరం విజేతలకు ప్రొఫెసర్ శివరామ కృష్ణ బహుమతులు ప్రదానం చేశారు.

కార్యక్రమంలో శ్రీ కె. కృష్ణారావు (కళాశాల కార్యదర్శి & కరస్పాండెంట్), మేనేజ్‌మెంట్ సభ్యులు శ్రీ టి. రాకేష్ రెడ్డి, శ్రీ ఆర్. ప్రదీప్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ బి.ఎల్. రాజు, డీన్ ప్రొఫెసర్ ఎ. వినయ్ బాబు, డైరెక్టర్లు డాక్టర్ సత్యప్రసాద్ లంక, డాక్టర్ వి.అనురాధ, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ శ్రీ ఎ. రమేష్, మరియు అధ్యాపక సభ్యులు ఎం.నరసింహ, ఇ.లతాదేవి, బి.వి.భార్గవి, డాక్టర్ ఆర్. గంగాధర్, జె.పి. ప్రమోద్ పాల్గొన్నారు. విద్యార్థి వాలంటీర్లు మేధ, విశిష్ట, వర్షిత, గీతిక, ఆయేషా, అనన్య‌తో పాటు వందలాది మంది విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad