Thursday, December 5, 2024
HomeTS జిల్లా వార్తలువరంగల్Warangal: పదేళ్లలో జరగని అభివృద్ధి ఏడాదిలో

Warangal: పదేళ్లలో జరగని అభివృద్ధి ఏడాదిలో

ప్రజా పాలన విజయోత్సవాలు

ప్రజా ప్రభుత్వం ఏర్పడి తొలి ఏడాది విజయవంతంగా అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుంచిన క్రమంలో తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవాల సంబరాలలో భాగంగా మంగళవారం అర్బన్ డే సందర్బంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రాంగణం నుండి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు నిర్వహించిన 2 కే రన్ ను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడేలతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. కేఎంసి నుంచి బల్దియా కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి, మున్సిపల్ కార్యాలయంలోని ఇండోర్ స్టేడియంలో కార్మికులకు హెల్త్ కిట్ లను, చలికాల రక్షణ దుస్తులను పంపిణి చేశారు.

- Advertisement -

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన ఏడాది కాలంలో రాష్ట్రంలో, హనుమకొండ జిల్లాలో వచ్చిన అభివృద్ధి మార్పును ప్రజలు గమనించాలని, పదేళ్లలుగా చేయలేని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సీఎం చేపట్టారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హనుమకొండ చౌరస్తలో ఇచ్చిన హామీ మేరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అమలు, మాస్టర్ ప్లాన్ కి నిధులను కేటాయించి ప్రజా ప్రభుత్వం చిత్త శుద్ధిని చాటుకున్నారని పేర్కొన్నారు. ఏడాది కాలంలో ప్రజా ప్రతినిధుల ప్రోత్సహం,అధికారుల సమిష్టి సహకారంతో జరిగిందని ఎమ్మెల్యే అన్నారు.

కార్యక్రమంలో కార్పొరేటర్లు దేవరకొండ విజయ లక్ష్మీ సురేందర్, సయ్యద్ విజయశ్రీ రాజాలి, మామిండ్ల రాజు,స్థానిక నాయకులు,మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News