అసెంబ్లీ హాల్లో ఐలమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు శాసన మండలి డిప్యూటీ ఛైర్మెన్ డా. బండా ప్రకాష్ ముదిరాజ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపి వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త, లెజిస్లేచర్ సెక్రటరీ డా. నరసింహచార్యులు, ఎల్ పి సెక్రటరీ రమేష్ రెడ్డి, బీసీ కమిషన్ మెంబర్ కిషోర్ గౌడ్.
ఈ సందర్భంగా మండలి డిప్యూటీ ఛైర్మెన్ బండా ప్రకాష్ మాట్లాడుతూ…. తెలంగాణ రైతాంగ పోరాటంలో వీర వనితగా గుర్తింపు పొందిన ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పిస్తున్నం. జమీందారీ, జాగిర్ధారి వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తులలో చాకలి ఐలమ్మ అగ్రగామిగా నిలిచింది. ఫ్యూడలిజానికి వ్యతిరేఖంగా పోరాడిన వ్యక్తి ఐలమ్మ. ఆమె స్ఫూర్తి బయటకు రావడానికి చాలా కాలం పట్టింది.తెలంగాణ ఉద్యమ సమయంలో ఐలమ్మ స్ఫూర్తి బయటకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం సాకారం అయిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ కి తెలంగాణ సమాజం పట్ల స్థితిగతుల పట్ల ఉన్న సమగ్ర దృష్టి వలనే ఐలమ్మ, దొడ్డి కొమురయ్య లాంటి అనేకమంది పోరాటయోధుల జయంతి వర్ధంతి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. అంతకుముందు ఐలమ్మ పేరు ఉచ్చరించడానికి కూడా గత పాలకులు ఇష్టపడ లేదు.
నేడు కాళోజీ నారాయణరావు, జయశంకర్ గారి పేర్ల మీద విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాం.
తెలంగాణ ఉద్యమం లో ఆమె పాత్ర గొప్పది ఆనాడు వీరోచిత పోరాటం చేసింది ఐలమ్మ. అందుకే తెలంగాణ వచ్చాక ఆమెను గుర్తుచేసుకుంటూ అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది.