Saturday, November 23, 2024
HomeతెలంగాణKhammam: కమిషనరేట్ ఏర్పాటు వల్లే నేరాలు తగ్గుముఖం పట్టాయి: పువ్వాడ

Khammam: కమిషనరేట్ ఏర్పాటు వల్లే నేరాలు తగ్గుముఖం పట్టాయి: పువ్వాడ

ఖమ్మం జిల్లాలో పోలీస్ పని తీరు అద్భుతంగా ఉంది-మంత్రి పువ్వాడ

రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని, ప్రజల భద్రతే ప్రధాన కర్తవ్యం గా పోలీస్ వ్యవస్థ నిర్విరామంగా పని చేస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ, జిల్లా పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ అధ్వర్యంలో చేపట్టిన సురక్ష దినోత్సవం కార్యక్రమాల్లో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్ అర్ అండ్ బి జి ఎన్ అర్ కాలేజ్ గ్రౌండ్స్ నుండి చేపట్టిన పోలీసుల వాహనాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , ఎంపి లు నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు.

- Advertisement -

ఎస్ అర్ అండ్ బి జి ఎన్ అర్ కాలేజ్ గ్రౌండ్ నుండి ప్రారంభమై ఇల్లందు సర్కిల్, ఐటి హబ్, జిల్లా కోర్టు, ఇందిరా నగర్ సర్కిల్, మీదగా చెన్నై షాపింగ్ మాల్, జెడ్పీ సెంటర్, జమ్మి బండ, తుమ్మల గడ్డ, చర్చ్ కాంపౌండ్, శ్రీనివాస్ నగర్, ప్రకాష్ నగర్ పోలీస్ కమాండ్ కంట్రోల్, బోస్ బొమ్మ సెంటర్, గ్రైన్ మార్కేట్, హర్కర బావి సర్కిల్, గణేష్ గంజ్, గాంధీ చౌక్, పి ఎస్ అర్ రోడ్, నయా బజార్, కల్వోడ్డు, జూబ్లీ క్లబ్, మయూరి సెంటర్ మీదగా పాత బస్ స్టాండ్ వరకు భారీ పోలీస్ వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెరుగుతున్న జనాభా, నేరాలు, సైబర్ క్రైమ్ వంటి సాంకేతికతో ముడిపడి ఉన్న నేరాల వంటి సవాళ్ళను ఎదుర్కునేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వసన్నద్ధమై ఉందన్నారు.
మహిళల భద్రత విషయంలోనూ హోం శాఖ పటిష్ట కార్యాచరణను అమలు చేస్తున్నదని అందుకు తగు ప్రణాళికలు చేసి విజయవంతంగా అమలు చేస్తున్నదన్నారు. ని వారి సేవలను మంత్రి కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వ పటిష్ట నిర్ణయాల వల్ల అరాచక శక్తులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై ఉక్కు పాదం మోపడం జరిగిందన్నారు. తెలంగాణా పోలీస్ శాఖ శాంతి భద్రతల నిర్వహణలో అద్భుతంగా పని చేస్తోందని, దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు. ఖమ్మంను కమిషనరేట్ గా చేసుకుని ప్రజల భద్రతతో పాటు శాంతి భద్రతలో అద్భుతంగా పని చేస్తుందన్నారు. కమిషనరేట్ ఏర్పాటు వల్లే నేరాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం అవసరమైన అన్ని రకాల తోడ్పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున అందిస్తామని తెలిపారు. నేడు దేశంలోనే తెలంగాణ అత్యంత భద్రత గల రాష్ట్రమని, రాష్ట్ర రాజధానిలో పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ తెలంగాణకు మరో మణిహారం అని, ప్రపంచ స్థాయి ప్రముఖ అద్భుత కట్టడాల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుందన్నారు. రాష్ట్రంలో పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు చేపట్టడం వల్లే నేడు రాష్ట్ర భద్రత అద్భుతంగా ఉందన్నారు.
పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరావు మాట్లాడుతూ..
దేశంలో ఏ రాష్ట్రంలో లేని సేవలను మన రాష్ట్రంలో పోలీస్ శాఖ అందిస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో పోలీస్ సేవ అనేది ప్రముఖమైందన్నారు. స్నేహపూర్వక పోలీస్ వ్యవస్థకు చిరునామాగా మన తెలంగాణ పోలీస్ వ్యవస్థ నిలిచిందన్నారు ఖమ్మం ప్రజానీకానికి నిస్వార్ధమైన సేవలను అందించడంలో ఖమ్మం పోలీస్ ముందుందన్నారు.


రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించుకునేలా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించిదన్నారు ఈ నేపథ్యంలో పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసేలా ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ వహించారన్నారు. 2014 ముందు పోలీస్ స్టేషన్ కి వెళ్లాలంటే ఇనుప కంచె గుర్తొచ్చే రోజులు మనందరికీ తెలుసు అని అన్నారు. ముఖ్యమంత్రి పోలీస్ శాఖ పై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పోలీస్ స్టేషన్ల రూపురేఖలే మారిపోయాయి అన్నారు. ఖమ్మం పోలీస్ కేరాఫ్ ఫ్రెండ్లీ పోలీసుకు చిరునామాగా నిలిచిందన్నారు.
జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ప్రతి ఒక్కరు ఘనంగా నిర్వహించు కోవాలన్నారు. ముఖ్యంగా పోలీసు సురక్ష దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలన్నారు. ఖమ్మం పోలీస్ లా అండ్ ఆర్డర్ను అదుపులో పెట్టిందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా జాబ్ మేళాను నిర్వహించి ఖమ్మం పోలీస్ సామాజిక సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం అయిందన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఖమ్మం పోలీస్…ఖమ్మం పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీస్…అనే తరహాలో ఖమ్మం పోలీస్ శాఖ ప్రజా సేవకై పనిచేస్తుందన్నారు. సంఘ విద్రోహక శక్తులను అణగదొక్కేలా, శాంతి భద్రతలను కాపాడటంలోనూ, ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం పెంపొందించేలా ఖమ్మం పోలీస్ తగు చర్యలు తీసుకుందన్నారు. ముఖ్యంగా యువతను సన్మార్గంలో నడిపించేలా ఖమ్మం పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు అమోఘం అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాత మధుసూదన్ మాట్లాడుతూఖమ్మం పోలీస్ శాఖ ర్యాలీకి ప్రజల్లో వచ్చిన స్పందన చూస్తుంటే పోలీసు వ్యవస్థ ప్రజల్లో ఎంత నమ్మకం పెరిగింది అనేది ఇట్టే అర్థమయిపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ప్రజలందరూ ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ మేయర్ ఫాతిమా, సుడా చైర్మన్ విజయ్ కుమార్, డి సి సి బి చైర్మన్ కురాకుల నాగభూషణం, శిక్షణ కలెక్టర్ లు రాధికా గుప్తా, మయాంక్ సింగ్, డి ఎఫ్ ఓ సిదర్త విక్రమ్ సింగ్, అదనపు డీసీపీ సుభాష్ చంద్ర బోస్, ఎ సి పి లు రామోజీ రమేష్, గణేష్, సి ఐ లు స్వామి, శ్రీధర్, సత్యనారాయణ, అంజలి, శ్రీనివాస్, అశోక్, చిట్టిబాబు, ఎమ్ టి ఓ శ్రీనివాస్, అడ్మిన్ అర్ ఐ లు రవి, తిరుపతి, సింహాచలం సాంబశివ రావు, లు సిబ్బంది ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News