Saturday, April 5, 2025
HomeతెలంగాణHarish Rao: ఎవడెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ మనదే

Harish Rao: ఎవడెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ మనదే

ఎవడెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది మనమే అంటూ ఖమ్మం కల్లూరు ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. 50 పడకల ఆసుపత్రి, ఇరిగేషన్ కార్యాలయం భావనలకు శంకుస్థాపనలు చేశారు మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లురులో మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా కల్లూరు చేరుకున్న వారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత కల్లూరు మండల కేంద్రంలో రూ.10.50 కోట్లతో నిర్మింకానున్న 50 పడకల ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారితో కలిసి శంకుస్థాపన చేసిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ .
కల్లూరులో రూ.1.93 కోట్లతో నూతనంగా నిర్మించనున్న పర్యవేక్షక ఇంజనీర్, నీటి పారుదల శాఖ కార్యాలయ భవనాన్ని శంకుస్థాపన చేశారు.
అనంతరం కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్ నందు ఏర్పాటు చేసిన BRS పార్టీ ఆత్మీయ సమ్మేళనంకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపీలు నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవించంద్ర, బండి పార్థసారథి రెడ్డి, జిల్లా కలెక్టర్ VP గౌతమ్, జెడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్, TSMSIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News