ఫార్ములా-ఈ రేసు(Formula-E Race) కేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తక్షణ విచారణ చేపట్టేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ పిటిషన్‌పై జనవరి 15న విచారణ జరుపుతామని సీజేఐ ధర్మాసనం వెల్లడించింది. కాగా ఈ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్యాష్ పిటిషన్‌ను ఇటీవల హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు అక్కడ కూడా ఊరట లభించకపోవడంతో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారేమో అని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఆయనను అధికారులు విచారిస్తున్నారు. ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్‌ల ఆధారంగా అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా కేటీఆర్ విచారణ దృష్ట్యా పోలీసులు ఏసీబీ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటుచేశారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ కీలక నేతలను గృహనిర్భందం చేశారు.