తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ-కార్ రేసు(Formula E car race) వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై(KTR) ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పైనా కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా అరవింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చింది.
కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్వహించిన ఫార్ములా-ఈ కార్ రేసుకు సంబంధించి జరిగిన రూ.46కోట్ల మేర అవకతవకలపై కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్(FIR) నమోదు చేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ(Jishnu Dev Varma) అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. గవర్నర్ అనుమతి లేఖను సీఎస్ శాంతి కుమారి ఏసీబీకి పంపించారు. దీంతో తాజాగా కేటీఆర్‌పై ఏసీబీ నమోదు చేసింది. దీంతో ఆయన అరెస్ట్ కావడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.