ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)కు హైకోర్టులో భారీ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. ఆయన దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దూకుడు పెంచారు. మాదాపూర్‌లోని గ్రీన్‌కో(Greenko) కార్యాలయంలో ఏసీబీ(ACB Raids) అధికారులు సోదాలు చేపట్టారు. ఫార్ములా-ఈ రేస్ ఒప్పందానికి ముందు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి రూ.41 కోట్లు ఇవ్వడంపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, మచిలీపట్నం ఆఫీసుల్లో ఏకకాలంలో రికార్డులను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఏస్ జెన్‌నెక్ట్స్ కంపెనీలో కూడా తనిఖీలు చేస్తున్నారు.
కాగా 2022 అక్టోబరు 25న రేసు నిర్వహణకు సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. అంతకుముందు అదే ఏడాది ఏప్రిల్‌లో రూ.31 కోట్లు, అక్టోబరులో రూ.10 కోట్లు గ్రీన్‌కో అనుబంధ సంస్థలు ఎలక్టోరల్ బాండ్లను బీఆర్ఎస్ పార్టీకి అందజేశాయి.