Saturday, November 23, 2024
HomeతెలంగాణAchchampet: బ్రేక్ ఫాస్ట్ స్టూడెంట్స్ కు వరం

Achchampet: బ్రేక్ ఫాస్ట్ స్టూడెంట్స్ కు వరం

బాగా చదివి మంచి పేరు తేవాలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకం ఒక వరం లాంటిదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకాన్ని అచ్చంపేట పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థులకు అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టి వారి ఆకలి తీర్చనున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ మహిళలను దృష్టిలో పెట్టుకుని ఇంటింటికి త్రాగునీరు అందించారని, వారి పేరిట గృహలక్ష్మి, కళ్యాణలక్ష్మి, అమ్మఒడి తదితర పథకాలకు మహిళల పేరుపై ఇవ్వడం మహిళలపై ఉన్న గౌరవం అని వివరించారు.

ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు అల్పాహారం ఏర్పాటు చేశారన్నారు. సీఎం కేసీఆర్ తన మేధాస్సును ఉపయోగించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నత రాష్ట్రంగా నిలిపారన్నారు బాలరాజు.
విద్యార్థులు బాగా చదివి ఉన్నతమైన స్థానంలో నిలవాలని, పాఠశాలకు తల్లిదండ్రులకు, ఈ ప్రాంతానికి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థినీలతో కలిసి అల్పాహారాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు మనోహర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి అరుణ, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, MEO రామారావు, ప్రిన్సిపాల్ సరళ, ఉపాధ్యాయులు, విద్యార్థినీలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News