పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా విడుదలైన కృష్ణమ్మ జలాలతో అచ్చంపేట నియోజకవర్గం లోని దేవతల పాదాలు కడగడం జరిగిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, .గువ్వల బాలరాజు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం అచ్చంపేట పట్టణంలోని లింగాల రోడ్డులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణమ్మ జలాలతో స్వామివారి పాదాలను అర్చకులు కడిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా విడుదలైన కృష్ణమ్మ జలాలతో రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అనుగ్రహంతో నియోజకవర్గంలోని రైతులు పాదాలు కడుగుతామని అన్నారు.అదేవిధంగా అచ్చంపేట నియోజకవర్గం లోని అన్ని గ్రామాలలో కూడా పెద్ద మొత్తంలో రైతులను భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నరసింహ గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు మనోహర్ ,మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అరుణ ,జడ్పీటీసీలు మంత్రియా నాయక్ ,రాంబాబు నాయక్ ,మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శైలజ ,కౌన్సిలర్లు గోపిశెట్టి శివ ,మను పటేల్ ,గడ్డం రమేష్ , బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పులిజాల రమేష్ ,నాయకులు శంకర్ మాదిగ ,రేవల్లి హుస్సేన్ ,ఆంజనేయులు, శీను ,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.