గత 40 సంవత్సరాలుగా భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు ఎదురుచూస్తూ వస్తోంది. చరిత్ర తిరగరాస్తు కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగిరేశారు, ఎమ్మెల్యేగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డిపై 25 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు సాధించారు. ఈ విజయంతో భూధాన్ పోచంపల్లి పట్టణ, మండల వ్యాప్తంగా విజయోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తడక వెంకటేష్ మాట్లాడుతూ అటు రాష్ట్రంలో ఇటు భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఎంతో కష్టపడి శ్రమించి పార్టీని గెలిపించుకున్నారని తెలంగాణని దోచుకున్న వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం పట్ల మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జెండాలతో ర్యాలీగా పూర్వ వీధుల గుండా జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సీట్లు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పాక మల్లేశం యాదవ్, డిసిసి ఉపాధ్యక్షులు సామ మధుసూదన్ రెడ్డి,రాఘవరెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ సామ ామ మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు మోటే రజిత రాజు,బోగా భానుమతి విష్ణు,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు భారత లవకుమార్,భారత వాసుదేవ్,సూరపల్లి రాము,గునిగంటి రమేష్ , గునిగంటి వెంకటేష్, కుక్క కుమార్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ సెగ్మెంట్ జనరల్ సెక్రెటరీ చేరాల సుధీర్ కుమార్, గ్యార సందీప్ జింకల జయసూర్య జింకల కుమార్,కట్కూరి లింగస్వామి, చేరాల మహేందర్,చేరాల శ్రీకాంత్, బిజిలి కుమార్,నోముల మమత,కుడికాల సృజన,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు