Saturday, November 23, 2024
HomeతెలంగాణAgriculture University: విత్తన మేళా-2023 ప్రారంభం

Agriculture University: విత్తన మేళా-2023 ప్రారంభం

ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ ఆడిటోరియంలో విత్తన మేళా-2023ని ప్రారంభించారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అత్యధిక వ్యవసాయ భూమి కలిగిన దేశం భారత్, భారత వ్యవసాయమే ప్రపంచానికి మార్గదర్శనమని నిరంజన్ రెడ్డి అన్నారు. ఉత్తమ వ్యవసాయ విధానం దేశంలో రావాలని, రైతులకు, సాగుకు అండగా నిలవాలని, తెలంగాణ విత్తనోత్పత్తి రాష్ట్రంగా ఎదగాలని, రైతుల చైతన్యానికే విత్తనమేళాలంటూ ఆయన చెప్పుకొచ్చారు. విత్తన పరిశోధనా ఫలితాలు రైతుకు చేరినప్పుడే సార్దకతన్న మంత్రి.. విత్తన పంటలకు తెలంగాణ ప్రాంతం శ్రేష్టమయినది .. దాని మీద రైతాంగం దృష్టిసారించాలన్నారు.

- Advertisement -

ఆహార, వాణిజ్య పంటల సాగు నుండి విత్తన పంటల వైపు మళ్లాలని, విత్తన నిల్వకు, నాణ్యమైన దిగుబడులకు ఈ నేలలు అనుకూలమన్నారు. విత్తనరంగం ద్వారా దేశంలో పురోభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలదొక్కుకుంటున్నామని, సోయాబీన్ విత్తనోత్పత్తిని రాష్ట్రంలో ప్రోత్సహించాలని, 45 రకాల విత్తనాలను మేళాలో అందుబాటులో పెట్టడం అభినందనీయమన్నారు. వరి, మొక్కజొన్న, జొన్న సహా 10 రకాల పంటల విత్తనాలు విక్రయిస్తున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం, పాలెం, జగిత్యాల, వరంగల్ ప్రాంతీయ పరిశోధన స్థానాల్లో విత్తన మేళాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.

ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ ఆడిటోరియంలో విత్తన మేళా-2023ని ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హాజరైన ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, టీఎస్‌సీడ్స్‌ సంస్థ ఛైర్మన్‌ కోటేశ్వరరావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంతు కొడిబ, రిజిస్ట్రార్ సుధీర్ కుమార్ తదితరులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News