హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో(Hyderabad MLC Election) ఎంఐఎం విజయం సాధించింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల సిబ్బంది ఓట్ల లెక్కింపు ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే ఫలితం వెల్లడైంది. ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్‌కు 63 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు పోలయ్యాయి.
ఈ ఎన్నికకు సంబంధించి బుధవారం పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉండగా.. 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఆ పార్టీ ఎక్స్ అఫిషియో సభ్యులు మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. కాగా బీజేపీ నుంచి గౌతమ్ రావు, ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్ పోటీలో నిలిచారు.