ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష ఎంపీల సమావేశం ముగిసింది. పెండింగ్ సమస్యల సాధన అజెండాగా సమావేశం సాగింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పార్లమెంట్‌లో ఎలా పోరాడాలో చర్చించినట్లు చర్చించారు. దాదాపు 28 అంశాలపై సమావేశంలో చర్చించినట్లు భట్టి తెలిపారు. విభజన సమస్యలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు.
ఇక ఈ సమావేశానికి హాజరైన ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. RRR, మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, ఇతర అంశాలపై ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపిందన్నారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీల ప్రజలు గెలిపించారని.. కానీ ప్రధాని మోదీ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఒవైసీ మండిపడ్డారు. కాగా ఈ సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు హాజరుకాలేదు.