Allu Arjun: సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో పోలీసులు అరెస్ట్ చేసిన అల్లు అర్జున్ (Allu Arjun) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఆయన తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. అయితే అత్యవసర పిటిషన్‌ను ఉదయం 10.30 గంటలకే జత చేయాలి కదా అని కోర్టు ప్రశ్నించింది.
బుధవారం రోజే పిటిషన్ ఫైల్ చేశామని క్వాష్ పిటిషన్‌ను వేసినట్లు పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లామని బన్నీ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అయినా కానీ ఈ పిటిషన్‌ను సోమవారం విచారిస్తామని కోర్టు పేర్కొంది. దీంతో అప్పటివరకు అల్లు అర్జున్‌పై ఎలాంటి చర్చలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై పోలీసుల నుంచి వివరాలు తీసుకుంటామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానానికి తెలిపారు.