Friday, November 22, 2024
HomeతెలంగాణTelangana Government: దేశానికే తలమానికంగా 125 అడుగుల అంబేద్క‌ర్ భారీ విగ్రహం - మంత్రులు కొప్పుల‌,...

Telangana Government: దేశానికే తలమానికంగా 125 అడుగుల అంబేద్క‌ర్ భారీ విగ్రహం – మంత్రులు కొప్పుల‌, ప్ర‌శాంత్ రెడ్డి

Telangana Government: హైదరాబాద్‌ నడిబొడ్డున ట్యాంక్‌ బండ్‌ పక్కనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ స్మృతివనం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దేశంలోనే ఎత్తయిన 125 అడుగు బాబాసాహెబ్‌ విగ్రహం తెలంగాణ కే మాణిహరంగా నిలుస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ విగ్రహం నిర్మాణం పనులు 2023 ఫిబ్రవరి నాటికి పూర్తి అవుతాయ‌ని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు నిర్మాణ పనులు త్వరితగతిన జరుగుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ వద్ద11.5 ఎకరాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న 125 అడుగుల పొడవైన అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను సోమవారం అధికారులతో మంత్రులు పరిశీలించారు.

- Advertisement -

అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఎంతో గౌరవమని, ఆయన రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. దేశంలో అతి ఎత్తయిన అంబేద్కర్‌ విగ్రహాన్ని రాష్ట్రంలో నెలకొల్పుతామని, స్మృతివనాన్ని తీర్చిదిద్దుతామని 2016 ఏప్రిల్‌ 14న నిర్వహించి అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారని మంత్రి కొప్పుల ఈశ్వర్ గుర్తు చేశారు, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జనరంజక పాలన కొనసాగిస్తున్నారని మంత్రులు చెప్పారు.

హైదరాబాద్ నగరం నడిబొడ్డున నిర్మితమవుతున్న ఈ కట్టడాల గురించి సీఎం కేసీఆర్ మానిటరింగ్ చేస్తున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు, విగ్రహం అడుగు భాగంలో పార్లమెంట్ తరహా నిర్మాణం చేస్తున్నామని వెల్లడించారు. అంబేద్కర్ విగ్రహం కింది భాగంలో అంబేద్కర్ ఫొటో గ్యాలరీ తో పాటు ఆయన గొప్పతనం, జీవిత చరిత్రను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో సినిమా థియేటర్ కూడా ఉంటుందన్నారు. అంబేద్కర్ విగ్రహం పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు, సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు తమకు సలహాలు సూచనలు ఇస్తున్నారని తెలిపారు, 2023 ఫిబ్రవరి నెలలో పనులు పూర్తి చేస్తామన్నారు. ఏప్రిల్‌లో అంబేద్కర్ జన్మదిన వేడుకలు సందర్భంగా విగ్రహాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News